Manchu Manoj : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రైటర్ కలయికలో మంచు మనోజ్ పెళ్లి సాంగ్..
మంచు మనోజ్, భూమా మౌనిక ఇటీవల చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్ళికి సంబంధించిన ఒక ఆల్బమ్ సాంగ్ ని మనోజ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్ తో రెడీ చేయించాడు.
- gum 95921
- Published On : April 17, 2023 / 09:30 PM IST
Manchu Manoj and Bhuma Mounika wedding song by Achu Rajamani Ananta Sriram
Manchu Manoj : మంచు మనోజ్ ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని (Bhuma Mounika) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరిది ప్రేమ వివాహం అయ్యినప్పటికీ ఇద్దరికీ ఇది రెండో వివాహం. గతంలో వీరిద్దరికి విడివిడిగా పెళ్లి అయ్యింది. అయితే మనస్పర్థలు రావడంతో విడాకులతో విడిపోయారు. రెండో పెళ్లి కావడంతో హైదరాబాద్ లోని మనోజ్ ఇంట్లోనే మార్చి 3న చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. దీంతో పెళ్లికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు పెద్దగా బయటకి రాలేదు.
Ram Charan – Manchu Manoj : మంచు మనోజ్‌కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా?
తాజాగా మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా ఒక అప్డేట్ ఇచ్చాడు. తన పెళ్లి ప్రయాణం పై ఒక సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ పాటకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అచు రాజమణి (Achu Rajamani) స్వరాలూ అందించగా అనంత శ్రీరామ్ (Ananta Sriram) లిరిక్స్ ని సమకూర్చాడు. ఈ సాంగ్ ని రేపు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సాంగ్ ని తన భార్య మౌనికకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్ తో రెడీ చేయిస్తున్న ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.
కాగా మనోజ్ కొంత కాలంగా యాక్టింగ్ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు. చివరగా 2017లో ఒక్కడు మిగిలాడు(Okkadu Migiladu) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మనోజ్.. ఇటీవలే మళ్ళీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ‘వాట్ ది ఫిష్'(What the Fish) అనే చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించాడు. ఈ మూవీతో పాటు ‘మనం మనం బరంపురం’, మరో టైటిల్ లేని ఫిల్మ్ కూడా లైన్ లో ఉంది.
