Manchu Manoj : పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్.. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్..
పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్ అంటూ మంచు మనోజ్ కామెంట్స్. ఏపీలో రాబోయే ఎన్నికల ఉద్దేశంతో..
- gum 95921
- Published On : March 28, 2024 / 02:13 PM IST
Manchu Manoj comments about Mega family and Pawan Kalyan
Manchu Manoj : టాలీవుడ్ లో మెగా, నందమూరి, మంచు కుటుంబాల మధ్య ఎటువంటి విషయం జరిగినా.. అది అందరికి ఆసక్తి గానే ఉంటుంది. ఈ మూడు కుటుంబాల మధ్య పోటీతో కూడిన గొడవలు ఉండడంతో బయటకి శత్రువులుగా కనిపిస్తుంటారు. అయితే ఆ శత్రుత్వం పోటీ వరుకే అని, మళ్ళీ కలిసి కనబడుతూ తమ స్నేహాన్ని తెలియజేస్తుంటారు. తాజాగా మంచు వారసుడు మనోజ్.. మెగావారి ఈవెంట్ కి హాజరయ్యి తమ బంధం ఎలాంటిదో తెలియజేసారు.
నిన్న మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి దర్శకులు, యువ హీరోలు వచ్చి చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఇక ఈ ఈవెంట్ కి మనోజ్ కూడా రాగా, వేదిక పై మాట్లాడుతూ.. చరణ్ చిన్నప్పటి నుంచి చాలా దయాహృదయుడని చెప్పుకొచ్చారు. 2018లో ఒక ఆడబిడ్డకు సహాయం చేయడం కోసం చరణ్ కి మనోజ్ అర్ధరాత్రి ఫోన్ చేస్తే.. వెంటనే రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేసాడని చెప్పుకొచ్చారు.
Also read : Ram Charan : ఆడబిడ్డని కాపాడడం కోసం.. చరణ్‌కి అర్ధరాత్రి ఫోన్ చేసి డబ్బులు అడిగా.. మంచు మనోజ్
అలాగే మెగా, మంచు కుటుంబాల బాండింగ్ గురించి కూడా మాట్లాడారు. “చిరంజీవి, మోహన్ బాబు మధ్య గొడవలు రావొచ్చు. కానీ అవి భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు లాంటివి. వాటి మధ్యకి ఎవరైనా వెళ్ళారా, వాళ్ళే దెబ్బతింటారు. చిరంజీవి, మోహన్ బాబు మధ్య గొడవలు కూడా అవే. 40 ఏళ్ళ స్నేహం అది. వాళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాంటివారు” అంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాదు, మోహన్ బాబు స్టైల్ లో మెగా, మంచు రిలేషన్ ఎలాంటిదో కూడా చెప్పారు. “ది రిలేషన్ బిట్వీన్ మెగా అండ్ మంచు ఫ్యామిలీ ఈజ్ ఫిష్ అండ్ వాటర్. బట్ నాట్ ఏ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇదే వేదిక పై పవన్ గురించి మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్” అంటూ వచ్చే ఎన్నికల ఉద్దేశంతో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇటీవల మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ లో కూడా మంచు మనోజ్ చేసిన కామెంట్స్ పవన్ ఉద్దేశించినవే అంటూ బాగా వైరల్ అయ్యాయి.
https://youtu.be/fSoaAEULp5A
