Manchu Manoj Marriage : మనోజ్ పెళ్ళి దగ్గరుండి చేస్తున్న మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో మెహందీ వేడుకలు, డెకరేషన్ ఫోటోలు పోస్ట్..

తాజాగా మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన చేతులకు మెహందీ పెట్టుకున్న ఫోటోను, తన ఇంటిపై చేసిన డెకరేషన్ ఫోటోలని షేర్ చేసింది. అంతకుముందు రోజు కూడా తన ఇంట్లో నిర్వహించిన పూజా కార్యక్రమం ఫోటోని................

Manchu Manoj Marriage :  మంచు వారసుడు మంచు మనోజ్ కొన్ని సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ నుంచే కాక బయట నుంచి కూడా అభిమానులని సంపాదించుకున్నాడు. మనోజ్ చివరగా 2017లో ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ తర్వాత ఒక రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా అప్పట్నుంచి మంచు మనోజ్ సినిమాలకు దూరంగానే ఉన్నాడు. ఇటీవలే ఓ సినిమాని ప్రకటించి త్వరలోనే వస్తున్నాను అని తెలిపాడు మనోజ్.

గత కొన్ని నెలలుగా మాత్రం మంచు మనోజ్ వార్తల్లో నిలుస్తున్నాడు. మనోజ్ మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు, ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి నేడు మార్చ్ 3న జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ పూజా కార్యక్రమం కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక పెళ్లి మోహన్ బాబు ఇంట్లో సింపుల్ గా జరుగుతుంది. మంచు మనోజ్, మౌనిక ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడంతో కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఈ పెళ్లి జరగనుందని తెలుస్తుంది. ఇప్పటికే మోహన్ బాబు ఇల్లు లోపల, బయట అందంగా డెకరేట్ చేశారు.

Pathaan Offer: పఠాన్ ఆఫర్.. ఈ సారి ఏకంగా ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ..

తాజాగా మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన చేతులకు మెహందీ పెట్టుకున్న ఫోటోను, తన ఇంటిపై చేసిన డెకరేషన్ ఫోటోలని షేర్ చేసింది. అంతకుముందు రోజు కూడా తన ఇంట్లో నిర్వహించిన పూజా కార్యక్రమం ఫోటోని షేర్ చేసింది. దీంతో మంచు లక్ష్మి దగ్గరుండి మనోజ్ పెళ్లి చేస్తున్నారు తెలుస్తుంది. మంచు అభిమానులు పెళ్లి ఫోటోలు బయటకి ఎప్పుడు వదులుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సన్నిహితుల సమాచారం ప్రకారం మార్చ్ 3 శుక్రవారం రాత్రి మనోజ్, భూమిక పెళ్లి జరగనున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు