×
Ad

Ram Charan : ఆడబిడ్డని కాపాడడం కోసం.. చరణ్‌కి అర్ధరాత్రి ఫోన్ చేసి డబ్బులు అడిగా.. మంచు మనోజ్

ఆడబిడ్డని కాపాడడం కోసం చరణ్‌కి అర్ధరాత్రి ఫోన్ చేసి డబ్బులు అడిగిన మంచు మనోజ్.

  • Published On : March 28, 2024 / 07:50 AM IST

Manchu Manoj shares a interesting matter about Ram Charan

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన తండ్రి, బాబాయ్‌లా ఎంతో మందికి సహాయం చేస్తుంటారు. కానీ అవి అన్నీ బయటకు తెలియకుండానే ఉంటాయి. అయితే ఈ సహాయాలు పొందినవారు, సహాయాలు చూసినవారు.. ఏదో సందర్భాల్లో బయటపెట్టడం వల్ల అందరికి తెలుస్తుంటాయి. ఈక్రమంలోనే తాజాగా చరణ్ చేసిన ఓ సహాయం గురించి మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

నిన్న మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో.. ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈవెంట్ ని పెట్టారు. ఇక ఈ ఈవెంట్ కి మంచు మనోజ్ అతిథిగా వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో చరణ్ గురించి మనోజ్ మాట్లాడుతూ.. “2018లో నేను అమెరికాలో ఉన్న సమయంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక ఆడబిడ్డ దుబాయ్ లో ఇమిగ్రేషన్ సమస్య వచ్చి చిక్కుకుపోయింది. ఐదు లక్షల సహాయం కోసం నాకు ఫోన్ చేసారు. కానీ ఆ సమయంలో నా దగ్గర మనీ అంత లేవు. దీంతో అర్ధరాత్రి సమయంలో చరణ్ కి ఫోన్ చేసి విషయం చెప్పను. కేవలం నిమిషంలో చరణ్ డబ్బులు పంపించేశాడు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read : Kalki 2898 AD : జగదేకవీరుడి డేట్‌ని వదిలేసి.. బాహుబలి డేట్ వైపు చూస్తున్న కల్కి..

ఇక ఇదే ఈవెంట్ లో ‘గేమ్ ఛేంజర్’ నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఆయన ఈ ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడుతూ.. “ఇంకో ఇది నెలలు ఓపిక పట్టండి. రెండు నెలల్లో షూటింగ్ పూర్తి అవుతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో శంకర్ గారు జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఇంకొన్ని నెలలు ఓపిక పట్టండి” అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాని దివాళీ కానుకగా రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారట.