Kalki 2898 AD : జగదేకవీరుడి డేట్‌ని వదిలేసి.. బాహుబలి డేట్ వైపు చూస్తున్న కల్కి..

జగదేకవీరుడి డేట్‌ని వదిలేసి బాహుబలి డేట్ వైపు చూస్తున్న ప్రభాస్ కల్కి మూవీ. ప్రస్తుతం ఈ విడుదల తేదీ గురించి..

Kalki 2898 AD : జగదేకవీరుడి డేట్‌ని వదిలేసి.. బాహుబలి డేట్ వైపు చూస్తున్న కల్కి..

Prabhas Kalki 2898 AD movie postponed to baahubali date for release

Updated On : March 27, 2024 / 5:46 PM IST

Kalki 2898 AD : టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి 2898 AD’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీలో దీపికా పదుకోన్, దిశాపటాని హీరోయిన్స్‌గా, అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ముఖ్య పాత్రలు, కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.

కాగా ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు అనౌన్స్ చేసారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందిన చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మూవీ ఆ డేట్ లో రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని అందుకుంది. దీంతో కల్కిని కూడా అదే డేట్ లో రిలీజ్ చేసి.. మళ్ళీ జగదేకవీరుడి తరహా రిజల్ట్ ని అందుకోవాలని నిర్మాతలు భావించారు. కానీ వీరి ప్లానింగ్ కి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అడ్డుగా వచ్చాయి.

Also read : Balakrishna – Prithviraj Sukumaran : హీరో పృథ్వీరాజ్ డైరెక్షన్‌లో బాలయ్య మూవీ.. వీడియో వైరల్..

దీంతో కల్కి రిలీజ్ డేట్ ని మార్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అలా చేయకుంటే కల్కి కలెక్షన్స్ కి గండి పడి, బ్యాడ్ రిజల్ట్ ని చూడవల్సి ఉంటుంది. అందుకనే మూవీ టీం కూడా సినిమాని పోస్టుపోన్ చేయడానికి సిద్దమైనట్లు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తుంది. ఈక్రమంలోనే కల్కిని జగదేకవీరుడి డేట్‌ నుంచి బాహుబలి డేట్ కి తీసుకు వెళ్లాలని చూస్తున్నారట. బాహుబలి ఫస్ట్ పార్ట్ జులై 10న రిలీజయ్యి ఘన విజయం సాధించింది.

ఇప్పుడు కల్కిని కూడా అప్పుడే తీసుకు వచ్చి అదే మ్యాజిక్ ని క్రియేట్ చేయాలని భావిస్తున్నారట. అయితే జులై 10 బుధవారం వచ్చింది. వీక్ మధ్య తేదీ కాబట్టి.. అటు ఇటుగా జులైలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. కాగా ఈ మూవీ ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే రేపు ముంబై ఓ షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం.