Manchu Manoj: మీరున్నంత వరకూ నాకేం కాదు.. మిరాయ్ ఈవెంట్ లో మంచు మనోజ్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వస్తున్న మూవీ మిరాయ్. రాకింగ్ స్టార్ మంచు మనోజ్(Manchu Manoj) కీ రోల్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు.

Manchu Manoj's interesting comments at the Mirai event

Manchu Manoj: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వస్తున్న మూవీ మిరాయ్. రాకింగ్ స్టార్ మంచు మనోజ్(Manchu Manoj) కీ రోల్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. ఫాంటసీ ఎలిమెంట్స్ తో భారీగా తెరకెక్కిన ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మిరాయ్ ప్రీ రిలీజ్ సోమవారం వైజాగ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

Mirai Pre Release Event : మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..

ఈ ఈవెంట్ లో హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ “మీరు నాతో ఉన్నతవరకు నాకేం కాదు” అంటూ తన ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. చెట్టు పేరు చెప్పుకొని అమ్ముడుపోయెందుకు నేను కాయో.. పండో కాదు మనోజ్ అంటూ చప్పుకొచ్చారు. నా మొదటి సినిమా నుండి ఇప్పటివరకు నాకు వైజాగ్ తో మంచి అనుబంధం ఉంది. నా సినిమాలన్నీ ఇక్కడే ఎక్కువగా షూటింగ్ జరిగాయి. కకొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ కోసం ఎలాంటి సినిమా చేస్తే బాగుంటది అనుకునే సమయంలో కార్తీక్ నాకు మిరాయ్ కథ చెప్పాడు.

వయసులో చిన్నవాడు లేకపోతే కాళ్లకు దండం పెట్టేవాణ్ణి. అంత గొప్పగా మిరాయ్ కథను రాశారు. బ్లాక్ స్వార్డ్ పాత్ర మీకు ఖచ్చింతంగా నచ్చుతుంది. ఇండస్ట్రీలో సపోర్ట్ లేకుండా నిలదొక్కుకోవడం చాలా కష్టం కానీ, ఆ విషయంలో తేజ సజ్జను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మిరాయ్ ఖచ్చితంగా మీకు ఒక కొత్త అనుభూతుని మిగుల్చుతుంది. ఇంకా ఈ ఫ్రాంచైజీలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నా. అలాగే నేను ఎంతగానో అభిమానించే మా పవన్ కళ్యాణ్ అన్న ఓజీ సినిమా కూడా వస్తుంది చాలా ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.