Manchu Vishnu and manoj issues goes viral with manoj facebook post
Manchu Vishnu Vs Manoj : అన్నదమ్ముల మధ్య గొడవలు సాధారణమే. కానీ సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగితే అవి వైరల్ గా మారతాయి. గత కొన్నాళ్లుగా మంచు మనోజ్ కి, విష్ణుకి మధ్య మాటలు లేవని తెలుస్తుంది. ఇటీవల మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు రాకపోవడం, మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో మనోజ్, విష్ణు మాట్లాడుకోకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో గొడవ అవుతుందని వార్తలు వచ్చాయి. మనోజ్ రెండో పెళ్లి కూడా విష్ణుకి ఇష్టం లేనట్టు తెలుస్తుంది.
తాజాగా మంచు మనోజ్, విష్ణు గొడవ బయటకి వచ్చింది. మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తుండటంతో తీసిన వీడియోని తన ఫేస్ బుక్ స్టోరీలో పెట్టి.. విష్ణు ఇలా వచ్చి అప్పుడప్పుడు నా మనుషులను కొడతాడు అని మనోజ్ తెలిపాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో విష్ణు మనోజ్ కి చెందిన మనుషులపై కోప్పడటం, కొట్టడానికి ట్రై చేస్తుండటం ఉంది.
Vishwaksen : ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను..
ఇన్నాళ్లు సైలేంట్ గా ఉన్న వీళ్ళు మంచు మనోజ్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అన్నదమ్ముల మధ్య విబేధాలు రోడ్డుకెక్కాయి. సోషల్ మీడియాలో, మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఇంకా ఈ వివాదంపై ఎవరూ స్పందించలేదు. విష్ణు కానీ మోహన్ బాబు కానీ దీనిపై స్పందిస్తారేమో చూడాలి.