Manchu Vishnu : ఆ విషయంలో మాట నిలబెట్టుకున్న మంచు విష్ణు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని సభ్యులందరికి ఉచితంగా హెల్త్ చెకప్ లు నిర్వహిస్తామని తన హామీల్లో పేర్కొన్నాడు. అలాగే హెల్త్ భీమాని కూడా అందిస్తాం అని తెలిపాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ మాటని ఇప్పుడు మంచు విష్ణు................

Manchu Vishnu :  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఇందులో గెలవడానికి అనేక హామీలు ఇచ్చారు రెండు వర్గాలు. కానీ చివరకి మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిచారు. అనేక హామిలు ఇచ్చినా అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సొంత బిల్డింగ్ పైన మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గెలిచి ఇన్ని నెలలు అవుతున్నా అసలు దాని ఊసే లేదు అని పలువురు విమర్శించారు కూడా.

కానీ మంచు విష్ణు ఓ విషయంలో మాత్రం మాట నిలబెట్టుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని సభ్యులందరికి ఉచితంగా హెల్త్ చెకప్ లు నిర్వహిస్తామని తన హామీల్లో పేర్కొన్నాడు. అలాగే హెల్త్ భీమాని కూడా అందిస్తాం అని తెలిపాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ మాటని ఇప్పుడు మంచు విష్ణు నిలబెట్టుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఆదివారం నాడు ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ సహాయంతో సభ్యులందరికి పూర్తి మాస్టర్ హెల్త్ చెకప్ ఫ్రీగా నిర్వహించారు.

Sreeleela : అనాథాశ్రమంలో పిల్లలతో సందడి చేసిన శ్రీలీల

దీనిపై మంచు విష్ణు మాట్లాడుతూ.. మాస్టర్ చెకప్ కి పదివేలు అవుతుంది. కానీ కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళు మాకు ఫ్రీగా అందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ముందుకొచ్చిన హాస్పిటల్ యాజమాన్యానికి థ్యాంక్యూ అని తెలిపారు. అలాగే వైస్ ప్రసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికి మూడు లక్షల విలువైన హెల్త్ భీమని కూడా ఉచితంగా అందిస్తున్నాం అని తెలిపారు. ఇక ఈ క్యాంప్ పై మంచు విష్ణు తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు