Manchu Vishnu – Pawan Kalyan : ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే.. గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ని అడుగుతా అంటున్న మంచి విష్ణు..

ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో #AskVishnu పేరుతో నెటిజన్లతో ముచ్చటించగా ఫ్యాన్స్, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Manchu Vishnu gives Clarity on Kannappa Movie Pre Release Event and Guest

Manchu Vishnu – Pawan Kalyan : : మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ‘క‌న్న‌ప్ప‌’ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు నిర్మాణంలో ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్‌, అక్ష‌య్ కుమార్, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మోహ‌న్ లాల్‌, శ‌ర‌త్ కుమార్‌, మోహ‌న్ బాబు, మ‌ధుబాల.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు.

కన్నప్ప షూటింగ్ అంతా ఆల్మోస్ట్ న్యూజిలాండ్ లో చేసారు. ఇప్పటికే ఓ టీజర్, పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు మరో టీజర్ రిలీజ్ చేసారు. కన్నప్ప సినిమాని ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో #AskVishnu పేరుతో నెటిజన్లతో ముచ్చటించగా ఫ్యాన్స్, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Also Read : Shriya Kontham : ‘గ్యాంగ్ లీడర్’లో నాని చెల్లి గుర్తుందా..? ఇప్పుడు హీరోయిన్ గా.. ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ ట్రైలర్ రిలీజ్..

ఈ సినిమా శ్రీకాళహస్తి కన్నప్ప చరిత్ర గురించి కాబట్టి కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారా అని అడగ్గా అవును అని సమాధానం ఇచ్చాడు విష్ణు. దీంతో కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలోని శ్రీకాళహస్తిలో జరుగుతుందని తెలుస్తుంది. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా పిలవచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా.. నేను ఆయన్ని కచ్చితంగా రమ్మని అడుగుతాను అని సమాధానం ఇచ్చాడు విష్ణు. దీంతో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా పిలుస్తాడని తెలిసినా, పవన్ డేట్ ఇచ్చి వస్తారా లేదా చూడాలి మరి.

 

Also Read : Manchu Vishnu : ఇంత మంచోడివి ఏంటి భయ్యా.. ఎంత నెగిటివిటీ చూపించినా పాజిటివ్ గా మంచు విష్ణు.. ట్వీట్ వైరల్..

మొత్తానికి మొదట్లో మంచు విష్ణు కన్నప్ప తీస్తున్నాడు అంటే ట్రోల్స్ వచ్చినా సాంగ్ బాగుండటం, టీజర్ మంచి హైప్ ఇవ్వడం, ప్రభాస్, అక్షయ్ కుమార్ ఉండటంతో పాటు నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు మంచు విష్ణు కూల్ గా సమాధానాలు ఇస్తూ సినిమా గురించి గొప్పగా చెప్పడంతో ఇప్పుడిప్పుడే కన్నప్ప సినిమాపై అంచనాలు నెలకొంటున్నాయి.