Kannappa : హీరోయిన్ లేకుండా ‘కన్నప్ప’ షూటింగ్ స్టార్ట్.. మూవీలో మరో సూపర్ స్టార్..!

హీరోయిన్ లేకుండా మంచు విష్ణు 'కన్నప్ప' షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ మూవీలో మరికొంతమంది సూపర్ స్టార్స్ కూడా..

Manchu Vishnu Kannappa movie shooting starts without heroine

Kannappa : మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు ‘భక్త కన్నప్ప’ని ఇటీవల లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘కన్నప్ప’ అనే టైటిల్ ని పెట్టారు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై మోహన్ బాబు (Mohan Babu) ఈ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ని న్యూజిలాండ్ లో జరుపుతామంటూ విష్ణు ఆల్రెడీ ప్రకటించాడు.

Prabhas : మరో ప్రభాస్ మైనపు బొమ్మ.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్..

తాజాగా విష్ణు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ని ఇచ్చాడు. చిత్ర యూనిట్ న్యూజిలాండ్ లో ల్యాండ్ అయ్యింది. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ఈ మూవీ జర్నీని ఒకసారి గుర్తు చేసుకున్నాడు. టాలీవుడ్ నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి ఈ సినిమా ఐడియాని ఏడేళ్ల క్రిందట విష్ణుకి చెప్పాడట. అప్పటి నుంచి విష్ణు ఈ ప్రాజెక్ట్ ని తన భుజాలు మీద వేసుకొని ముందుకు నడుస్తూ వచ్చాడు. ఇక ఈ మూవీ కథని డెవలప్ చేయడంలో రైటర్స్ పరచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయినాథ్, తోట ప్రసాద్, దర్శకులు నాగేశ్వరరెడ్డి, ఈశ్వర్ రెడ్డి సహకారం అందించారట.

Hero Suman : చంద్రబాబు అరెస్ట్ పై నటుడు సుమన్ కామెంట్స్.. ఇదొక గుణపాఠం..

ఇక ఈ సినిమా కోసం ఏడేళ్ల నుంచి ఎంతోమంది నిద్ర లేకుండా కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో మరికొంతమంది సూపర్ స్టార్స్ కూడా నటించబోతున్నారని చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఏ వివరాలు అయినా తన అధికారిక సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తానంటూ ఆడియన్స్ కి తెలియజేశాడు. కాగా ఈ చిత్రాన్ని మొత్తం సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తామంటూ విష్ణు గతంలోనే అనౌన్స్ చేశాడు.

ఈక్రమంలోనే నటీనటులు, టెక్నీషియన్స్ తో సహా మొత్తం 600 మంది న్యూజిలాండ్ చేరుకున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఇటీవల హీరోయిన్ ‘నుపుర్ సనన్’ డ్రాప్ అయ్యింది. దీంతో హీరోయిన్ లేకుండానే ఈ మూవీ షూటింగ్ మొదలయింది. ఇక ఈ మూవీలో ప్రభాస్, నయనతార కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు విష్ణు కూడా.. మరికొంతమంది సూపర్ స్టార్స్ మూవీలో కనిపిస్తారు అంటూ ట్వీట్ చేయడంతో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు