Hero Suman : చంద్రబాబు అరెస్ట్ పై నటుడు సుమన్ కామెంట్స్.. ఇదొక గుణపాఠం..

చంద్రబాబు అరెస్ట్ పై నటుడు సుమన్ స్పందించాడు. పాలిటిక్స్ లో ఇదొక గుణపాఠం అంటూ..

Hero Suman : చంద్రబాబు అరెస్ట్ పై నటుడు సుమన్ కామెంట్స్.. ఇదొక గుణపాఠం..

Tollywood Hero Suman comments on Chandrababu Naidu arrest

Updated On : September 25, 2023 / 3:03 PM IST

Hero Suman : టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్.. పొలిటికల్ గా కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతుంటారు. తాజాగా ఈయన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబుని ఇటీవల సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయం పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా ఒక మూవీ ఈవెంట్ లో సుమన్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Samantha : ప్రపంచాన్ని చుట్టేస్తున్న సమంత.. మొన్న ఆసియా.. నిన్న అమెరికా.. ఇవాళ యూరప్..

సుమన్ మాట్లాడుతూ.. “చంద్రబాబు గారు డేట్ ఆఫ్ బర్త్ చూసి కరెక్ట్ గా జ్యోతిష్యం చెప్పే జ్యోతిష్కుడు ఉంటే ఆయన ఎప్పుడూ బయటకి వస్తారో తెలుస్తుంది. టైం అనేది బాగుంటే లోకల్ కోర్టులో కూడా అనుకూలంగా జరుగుతుంది. ఆయనకు అనుకూలంగా వచ్చే వరకు ఆయన జైల్ లొనే ఉంటారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అన్ని ఆలోచించే చేసి ఉంటారు. చంద్రబాబు జైల్ కి వెళ్ళాడు అంటే జగన్ గారు చేశారు అని అంటున్నారు. కానీ అది కాదు, చాలా రిజన్స్ ఉంటాయి. పాలిటిక్స్ లో ఇదొక గుణపాఠం. టైం బ్యాడ్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి” అంటూ వ్యాఖ్యానించారు.