Prabhas : మరో ప్రభాస్ మైనపు బొమ్మ.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్..

కొత్తగా మరో ప్రభాస్ మైనపు బొమ్మ పుట్టుకొచ్చింది. అయితే దీని పై నెటిజెన్స్, ప్రభాస్ అభిమానులు..

Prabhas : మరో ప్రభాస్ మైనపు బొమ్మ.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్..

Prabhas bahubali wax statue trolls gone viral in social media

Updated On : September 25, 2023 / 3:36 PM IST

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపుని సంపాదించుకున్నాడు. ప్రభాస్ క్రేజ్ ని గుర్తించిన లండన్ మేడమ్‌ టుస్సాడ్స్‌ (Madame Tussauds) మ్యూజియం.. అక్కడ బాహుబలి అవతార్ లో ఒక మైనపు బొమ్మని ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఇక తాజాగా మరో ప్రభాస్ మైనపు బొమ్మ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ మైనపు బొమ్మ ఎక్కడ ఉంది..?

Hero Suman : చంద్రబాబు అరెస్ట్ పై నటుడు సుమన్ కామెంట్స్.. ఇదొక గుణపాఠం..

బెంగళూరులోని మైనపు మ్యూజియంలో ఈ కొత్త ప్రభాస్ బొమ్మని ఏర్పాటు చేశారు. ఈ మైనపు బొమ్మని కూడా బాహుబలి అవతార్ లోనే ఏర్పాటు చేశారు. ఇక ఈ బొమ్మకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ మైనపు బొమ్మని చూసిన నెటిజెన్స్, ప్రభాస్ అభిమానులు ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. అసలు ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తున్నారా..? కారణం ఏంటంటే.. ఆ మైనపు విగ్రహం చూడడానికి అసలు ప్రభాస్ లాగానే లేదు. అసలు ఆ మైనపు బొమ్మ ప్రభాస్‌ అని గుర్తు పట్టడానికి కూడా కష్టపడుతున్నారు.

Parineeti Raghav Wedding : ఘనంగా పరిణీతి చోప్రా – రాఘవ్ చద్దా వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Prabhas bahubali wax statue trolls gone viral in social media

Prabhas bahubali wax statue trolls gone viral in social media

దీంతో నెటిజెన్స్, ప్రభాస్ అభిమానులు.. ఆ బొమ్మని తొలిగించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ బొమ్మని చూసిన మరికొందరు.. డేవిడ్ వార్నర్ లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తుంది. మోకాలు సర్జరీ కోసం అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఆల్రెడీ చికిత్స పూర్తి అయ్యినట్లు వచ్చే వారం ఇండియాకి వస్తాడని, ఇక్కడికి వచ్చిన తరువాత కూడా రెండు వారలు పాటు షూటింగ్స్ కి విరామం ఇస్తాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు.