Nara Lokesh – Manchu Vishnu : నారా లోకేష్ ని కలిసిన మంచు విష్ణు.. మై బ్రదర్ అంటూ పోస్ట్.. ఫొటో వైరల్..

తాజాగా మంచు విష్ణు ఏపీ మంత్రి నారా లోకేష్ ని కలిశారు.

Manchu Vishnu Meets Nara Lokesh Photo and Twitter post goes Viral

Nara Lokesh – Manchu Vishnu : మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కన్నప్ప సినిమాని భారీగా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్.. లాంటి స్టార్స్ తో తెరకెక్కిస్తున్నారు. కన్నప్ప సినిమా ఏప్రిల్ 25 రిలీజ్ కానుంది. అయితే తాజాగా మంచు విష్ణు ఏపీ మంత్రి నారా లోకేష్ ని కలిశారు.

Also Read : RC 16 Update : రామ్ చరణ్ RC16 నుంచి అప్డేట్.. మీర్జాపూర్ మున్నా భయ్యా ఎంట్రీ..

తన ట్విట్టర్లో నారా లోకేష్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. నా సోదరుడు, డైనమిక్ ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో వివిధ అంశాలపై చర్చ జరిగింది. అతని పాజిటివ్ ఎనర్జీ అద్భుతం. దేవుడు నీకు మరింత శక్తినివ్వాలి బ్రదర్. హర్ హర్ మహాదేవ్ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే మంచు విష్ణు నారా లోకేష్ ని కలవడం చర్చగా మారింది.

ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఉండటంతో సినీ పరిశ్రమ గురించి ఏమైనా మాట్లాడటానికి వెళ్ళారా లేక తన విద్యాసంస్థల తరపున వెళ్ళారా అని ఆసక్తికరంగా మారింది.