RC 16 Update : రామ్ చరణ్ RC16 నుంచి అప్డేట్.. మీర్జాపూర్ మున్నా భయ్యా ఎంట్రీ..

తాజాగా మూవీ యూనిట్ నేడు RC16 సినిమా నుంచి అప్డేట్ ఇచ్చింది.

RC 16 Update : రామ్ చరణ్ RC16 నుంచి అప్డేట్.. మీర్జాపూర్ మున్నా భయ్యా ఎంట్రీ..

Ram Charan RC 16 Movie Update Mirzapur fame Divyendu Sharma on Board

Updated On : November 30, 2024 / 11:14 AM IST

RC 16 Update : రామ్ చరణ్ త్వరలో సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత RC16 సినిమా ఇప్పటికే మొదలుపెట్టేసారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా భారీగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. ఇటీవలే చరణ్ ఈ షూట్ లో జాయిన్ అయ్యాడు.

దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ సినిమా నుంచి రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఇప్పటికే మూడు పాటలు కూడా కంపోజింగ్ అయిపోయాయి. తాజాగా మూవీ యూనిట్ నేడు RC16 సినిమా నుంచి అప్డేట్ ఇచ్చింది.

Also Read : Pushpa 2 : ఆ యాప్‌తో పుష్ప 2 సినిమా లింకప్.. ఇక ఏ థియేటర్లో అయినా ఏ భాషలో అయినా సినిమా చూడొచ్చు..

ఈ సినిమాలో ఇప్పటికే శివ రాజకుమార్, జగపతి బాబు లాంటి స్టార్స్ నటిస్తున్నారని అనౌన్స్ చేయగా నేడు మీర్జాపూర్ ఫేమ్ మున్నా భయ్యా దివ్యేందు శర్మ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Image

మీర్జాపూర్ సిరీస్ లో అడల్ట్ డైలాగ్స్ తో మున్నా భయ్యాగా దివ్యేందు శర్మ బాగా వైరల్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నటుడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. బాలీవుడ్ లో పలు సిరీస్ లు, సినిమాలతో మెప్పించిన దివ్యేందు ఇప్పుడు రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో దివ్యేందు శర్మ నెగిటివ్ రోల్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది.