Pushpa 2 : ఆ యాప్‌తో పుష్ప 2 సినిమా లింకప్.. ఇక ఏ థియేటర్లో అయినా ఏ భాషలో అయినా సినిమా చూడొచ్చు..
పుష్ప 2 మూవీ యూనిట్ సినీ డబ్స్ అనే యాప్ తో లింకప్ చేసుకుంది.

Pushpa 2 Movie Unit Linkup With Cine Dubs App for giving best Experience to Audience
Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా భారీగా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. పుష్ప 2 పాన్ ఇండియా వైడ్ తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుష్ప మూవీ యూనిట్ ఓ యాప్ తో లింక్ అప్ అయి ప్రేక్షకులకు కొత్త వెసలుబాటు ఇవ్వనుంది. మనం పుష్ప సినిమా ఏ భాషలో ఆడే థియేటర్ కి వెళ్లినా అక్కడ మనకు కావాల్సిన భాషలో సినిమా చూడొచ్చు.
దీని కోసం పుష్ప 2 మూవీ యూనిట్ సినీ డబ్స్ అనే యాప్ తో లింకప్ చేసుకుంది. ఈ సినీ డబ్స్ యాప్ ఎలా పనిచేస్తుందంటే.. ప్లే స్టోర్ నుంచి సినీ డబ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనం సినిమా చూసేముందు ఆ యాప్ లో మనం ఏ థియేటర్లో, ఎన్ని గంటల షో చేస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం సినిమాని ఏ భాషలో చూడాలనుకుంటున్నామో మనకు కావల్సిన భాషను సెలెక్ట్ చేసుకొని ఆ సౌండ్ ట్రాక్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం సినిమా మొదలయ్యే సమయానికి హెడ్ ఫోన్స్ పెట్టుకొని సినిమా తెరపై ప్లే అవ్వగానే మన యాప్ లో కూడా ఆ సినిమా ప్లే బటన్ నొక్కాలి. దాంతో తెరపై సినిమా చూస్తూ ఆడియోని మనకు నచ్చిన భాషలో హెడ్ ఫోన్స్ ద్వారా వినొచ్చు.
Also Read : NTR : అప్పుడే ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా షూటింగ్ అయిపొవచ్చిందా? ఫైనల్ షెడ్యూల్ లో వార్ 2..
ఇప్పటికే ఈ యాప్ అందుబాటులో ఉంది. గతంలో హనుమాన్, స్పై, ఈగల్.. లాంటి తెలుగు సినిమాలతో కూడా సినీ డబ్స్ యాప్ లింకప్ చేసుకుంది. వీరికి మూవీ టీమ్ ముందే మొత్తం ఆడియో ఫైల్ ఇస్తారు. దాంతో సినీ డబ్స్ యాప్ మనం చూసే షోని బట్టి కావాల్సిన ఆడియో ప్లే చేస్తుంది. అయితే థియేటర్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా బయట థియేటర్ సినిమా సౌండ్స్ వినిపిస్తాయి. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
పుష్ప 2 కోసం కొత్త యాప్
ఈ యాప్ ఉంటే ధియేటర్ లో ఏ లాంగ్వేజ్ ప్రింట్ ఉన్నా ఆరు బాషల్లో మీకు నచ్చిన భాషలో సినిమా చూడొచ్చు: ప్రొడ్యూసర్స్#Pushpa2 pic.twitter.com/FC7YPnWlmv
— M9 NEWS (@M9News_) November 29, 2024