NTR : అప్పుడే ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా షూటింగ్ అయిపొవచ్చిందా? ఫైనల్ షెడ్యూల్ లో వార్ 2..

వార్ 2 షూటింగ్ కేవలం ఫైనల్ షెడ్యూల్ మిగిలి ఉందట.

NTR : అప్పుడే ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా షూటింగ్ అయిపొవచ్చిందా? ఫైనల్ షెడ్యూల్ లో వార్ 2..

NTR Hrithik Roshan Bollywood Movie War 2 left only Final Schedule Shoot

Updated On : November 30, 2024 / 10:04 AM IST

NTR : ఎన్టీఆర్ దేవర తర్వాత వార్ 2 సినిమాస్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే ఇప్పటికే ఈ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందట. వార్ 2 షూటింగ్ కేవలం ఫైనల్ షెడ్యూల్ మిగిలి ఉందట. వార్ 2 క్లైమాక్స్ సీన్స్ ని ఈ చివరి షెడ్యూల్ లో షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ రెండో వారంలో వార్ 2 చివరి షెడ్యూల్ ముంబైలో జరగనున్నట్టు బాలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్ లో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ మధ్య జరిగే భారీ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించబోతున్నారు. ఈ యాక్షన్స్ కోసం స్పిరో రజాటోస్, సే యోంగ్‌ ఓహ్‌ అనే ఇద్దరు హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్ ని తీసుకొస్తున్నారట.

Also Read : Ananya Panday : ‘లైగర్’ ఫ్లాప్.. దెబ్బకు నాన్నకు వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్..

మొత్తానికి ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా షూటింగ్ పూర్తికావొస్తుంది. డిసెంబర్ చివరికల్లా షూట్ పూర్తిచేసి 2025 లో ఈ సినిమా రిలీజ్ చేస్తారని సమాచారం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.