Ananya Panday : ‘లైగర్’ ఫ్లాప్.. దెబ్బకు నాన్నకు వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్..

లైగర్ సినిమా భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

Ananya Panday : ‘లైగర్’ ఫ్లాప్.. దెబ్బకు నాన్నకు వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్..

Ananya Panday Warning to Father after Vijay Deverakonda Liger Movie Flop

Updated On : November 30, 2024 / 9:53 AM IST

Ananya Panday : పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా వచ్చిన లైగర్ సినిమా భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఫ్లాప్ అవ్వడమే కాక ఈ సినిమాపై దారుణమైన ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇద్దాం అనుకుంది. కానీ ఆమె ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. ఇక ఈ సినిమాలో ఆమె తండ్రి, సీనియర్ నటుడు చుంకి పాండే కూడా నటించారు.

అయితే ఈ సినిమా స్క్రిప్ట్ అనన్యకు సజెస్ట్ చేసింది తన తండ్రే అట. దీంతో ఈ సినిమా భారీ ఫ్లాప్ మూట కట్టుకోవడంతో తండ్రికి ఇంకోసారి తన సినిమా స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని గట్టిగానే చెప్పిందట. తాజాగా అనన్య, చుంకి పాండే కలిసి ఓ బాలీవుడ్ షోలో పాల్గొనగా అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ చుంకి పాండే.. అనన్య సినిమా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నారు.

Also Read : Allu Arjun Lady Getup : పుష్ప లేడీ గెటప్ గురించి మాట్లాడిన బన్నీ.. ఫొటోషూట్ అంతా చేశాక సుకుమార్ నచ్చలేదని..

దీనికి వెంటనే అనన్య కౌంటర్ ఇస్తూ.. లైగర్ సినిమా తర్వాత స్క్రిప్ట్స్ విషయంలో నువ్వు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు అని చెప్పానుగా అంటూ గట్టిగానే హెచ్చరించింది. దీంతో అనన్య వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. లైగర్ ఫ్లాప్ అనన్యని బాగా నిరాశపరిచింది, ఆ సినిమా విషయంలో ఆమె బాగా హర్ట్ అయినట్టు తెలుస్తుంది. మరి భవిష్యత్తులో తెలుగు సినిమాలు చేస్తుందా లేక లైగర్ ఎఫెక్ట్ కి టాలీవుడ్ కి రాకుండా ఉంటుందా చూడాలి.