Manchu Vishnu Tweet: పవన్ కల్యాణ్.. నేనూ మాట్లాడుకున్నాం.. కావాలంటే చూడండి..!

అలయ్ బలయ్ ఈవెంట్ లో.. పవన్ కల్యాణ్ తనతో మాట్లాడిన విజువల్స్ ను మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఆ రోజు జరిగింది ఇదీ.. అంటూ క్యాప్షన్ పెట్టారు.

Vishnu Tweet

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కు.. జనసేనాని పవన్ కల్యాణ్ తో పాటు.. MAA నూతన అధ్యక్షుడు మంచు విష్ణు సైతం హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో ఇద్దరూ మాట్లాడుకోలేదని.. పూర్తిగా ఎడమొహం, పెడమొహంగా ఉన్నారని.. వార్తలు వచ్చాయి. ఆ విషయంపై.. మంచు విష్ణు ఇప్పటికే ప్రెస్ మీట్ లో స్పందించారు. తామిద్దరం మాట్లాడుకున్నామని.. తనకు మంచి సలహాలు కూడా పవన్ ఇచ్చారని చెప్పారు.

తాజాగా.. అలయ్ బలయ్ కు సంబంధించిన ఓ వీడియోను మంచు విష్ణు ట్వీట్ చేశారు. అసలు జరిగింది ఇదీ.. అంటూ ఓ క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు. అందులో.. పవన్, విష్ణు ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ.. చాలా సేపు మాట్లాడుకున్నారు. నవ్వుతూ.. ఉత్సాహంగా కనిపించారు. పవన్.. విష్ణుకు హగ్ కూడా ఇచ్చారు. ఇద్దరూ కలిసి పక్కనున్న వారితోనూ సరదాగా మాట్లాడారు.

అంతకు ముందే.. అలయ్ బలయ్ రోజున విష్ణు.. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ సైతం వైరల్ అయ్యింది. ఇప్పుడు తామిద్దరం మాట్లాడుకున్నాం.. కావాలంటే చూడండి.. అంటూ వదిలిన మరో ట్వీట్ కూడా.. మెగా, మంచు ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది.