Tu Yaa Main : ఆ బాలీవుడ్ సినిమాని తెగ పొగిడేస్తున్న మణిరత్నం..
బాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా 'తు యా మైన్' ఇటీవల రిలీజయి ప్రేక్షకులను మెప్పిస్తుంది.(Tu Yaa Main)
- Saketh U
- Published On : February 16, 2026 / 06:39 PM IST
Tu Yaa Main
Tu Yaa Main : బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కించిన బాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ‘తు యా మైన్’ ఇటీవల రిలీజయి ప్రేక్షకులను మెప్పిస్తుంది. శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా సౌత్ లో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేశారు.(Tu Yaa Main)
ఈ స్క్రీనింగ్ కి స్టార్ డైరెక్టర్ మణిరత్నం వచ్చి సినిమాని చూసారు. అనంతరం మణిరత్నం మీడియాతో మాట్లాడుతూ.. బిజోయ్ నంబియార్ ఈ సినిమాలో ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకువచ్చారు. ఇది థియేటర్లలో, ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం అంటూ పొగిడేశారు.
Also Read : Kiran Abbavaram : బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. రేటు పెంచేసిన కిరణ్ అబ్బవరం..? లైనప్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే..
ఈ స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత పలువురు ప్రేక్షకులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన సినిమా అని, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్టోరీటెల్లింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు సినిమా గురించి.
కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ, భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమాని నిర్మించారు. యూత్ ఆడియన్స్ టార్గెట్ గా ఎమోషన్స్, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ‘తు యా మైన్’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తుంది.
