Mani Sharma appreciated naga madhuri about Shambho Mahadeva song
Shambho Mahadeva : డాక్టర్, ఇంజనీరింగ్‌లు చేసిన వారి కూడా కళారంగం పై ఆసక్తితో తమలోని ఇటు వైపు వస్తుంటారు. కొంతమంది తమ రంగంలో కొనసాగుతూనే అప్పుడప్పుడు తమలోని కళాకారుడిని అందరికి పరిచయం చేసేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈక్రమంలోనే డాక్టర్ చదివిన నాగ మాధురి సంగీతంలోనూ నిష్ణాతురాలిగా రాణిస్తున్నారు.
నేత్ర వైద్యురాలుగా ఒంగోలులోని స్మార్ట్ విజన్ హాస్పిటల్ లో సేవలందిస్తూ మంచి పేరుని సంపాదించుకున్న నాగ మాధురి.. తన సంగీత సాధనతో కూడా శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రముఖ స్ట్రింగ్ ప్లేయర్ మాండలిన్ ఎస్.ఎమ్. సుభాని సారధ్యంలో ‘శంభో మహాదేవ’ అనే అద్భుతమైన పాటని పాడి.. తన పేరులో ఉన్న మాధురికి న్యాయం చేస్తున్నారు.
Also read : Sai Durgha Tej : మెగా కాంపౌండ్ నుంచి మరో నిర్మాత.. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే..
ఇక ఈ సాంగ్ ని దర్శకుడు విశ్వనాధ్ అరిగెల దర్శకత్వంలో ఓ వీడియో ఆల్బంగా రూపొందించారు. కాశి బ్యాక్‌డ్రాప్ లో ఆల్బంని అద్భుతంగా చిత్రీకరించారు. ఇక సాంగ్ ని విన్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ మెస్మరైజయ్యారు. నాగ మాధురిని ప్రత్యేకంగా అభినందించారు. మరి మెలోడీ బ్రహ్మని ఆకట్టుకున్న ఆ శివయ్య పాటని మీరు కూడా వినేయండి.