Mansoor Ali Khan : నా మీద తప్పుడు ప్రచారం.. నేనెలాంటివాడ్నో అందరికి తెలుసు.. త్రిషపై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన మన్సూర్ అలీఖాన్..

ఇటీవల మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో స్పందించాడు.

Mansoor Ali Khan Reacts on Trisha Issue Social Media Post goes Viral

Mansoor Ali Khan : విలన్ రోల్స్ ఎక్కువగా చేసే తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు. ఇటీవల మన్సూర్ అలీఖాన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. చాలా సినిమాల్లో రేప్ సీన్స్ చేశాను. చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. ఆ సీన్స్ లో నేను చాలా ఎంజాయ్ చేశాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో(Trisha) రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను. సినిమాలో అలాంటి సీన్ లేదు అని బాధపడ్డాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

మన్సూర్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనం సృష్టించడంతో త్రిష దీనిపై స్పందిస్తూ.. దీనిని త్రీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలని ద్వేషిస్తున్నట్టు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళతో కలిసి నాకు సినిమాలో సీన్స్ లేనందుకు నేను సంతోషిస్తున్నాను. నా తర్వాత సినిమాల్లో కూడా ఇతనితో కలిసి నటించకుండా ఉండేలా చూసుకుంటాను అని ట్వీట్ చేసింది.

ఇక త్రిషకి సపోర్ట్ గా లియో దర్శకుడు లోకేష్ కానగరాజ్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, మాళవిక, చిన్మయి, నితిన్.. ఇలా చాలా మంది ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ట్వీట్స్ చేస్తూ మన్సూర్ పై విమర్శలు చేస్తున్నారు. మన్సూర్ ని అరెస్ట్ చేయమని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై మన్సూర్ అలీ ఖాన్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Also Read : Sriram : ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’లో రవితేజకి బదులు ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా?

మన్సూర్ అలీఖాన్ తన సోషల్ మీడియాలో.. ఈ వీడియో వైరల్ అయిందని నేను నా ఫ్యామిలీ ద్వారానే విన్నాను. నేను పూర్తిగా మాట్లాడింది చూడకుండా అక్కడి వరకు మాత్రమే కట్ చేసి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నాకు కూడా కూతుళ్లు ఉన్నారు. నా కూతురు లియో సినిమా ఓపెనింగ్ కి కూడా వచ్చింది. నా కూతురు త్రిషకి పెద్ద ఫ్యాన్. తను త్రిషతో కూడా మాట్లాడింది. నాపై కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఇటీవల పాలిటిక్స్ లో చేరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. దీంతో మరికొంతమంది నన్ను ఇంకా నెగిటివ్ చేస్తున్నారు. అయినా నేను ఎన్ని సేవ కార్యక్రమాలు చేశానో, నేను ఎలాంటివాడినో తమిళ ప్రజలకు తెలుసు. నా గురించి ప్రశ్నించనవసర్లేదు. ఇది నాకు ఒక పరువు నష్టం లాంటిది అని పోస్ట్ చేశారు. దీంతో మన్సూర్ పోస్ట్ వైరల్ గా మారింది. కొంతమంది మన్సూర్ కి కూడా సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు