Sriram : ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’లో రవితేజకి బదులు ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా?

నటుడు శ్రీరామ్ అంటే అప్పట్లో ఆడపిల్లల అభిమాన హీరో. 'ఒకరికి ఒకరు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత తెలుగులో పెద్దగా నటించలేదు. తెలుగులో తను మిస్ అయిన ప్రాజెక్టుల గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

Sriram : ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’లో రవితేజకి బదులు ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా?

RAVITEJA

Sriram : హీరో శ్రీరామ్ పేరు చెప్పగానే ‘ఒకరికి ఒకరు’ సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమా తర్వాత అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా మారిపోయిన శ్రీరామ్ ఆ తర్వాత పెద్దగా తెలుగులో కనిపించలేదు. తమిళ్‌లో శ్రీకాంత్‌గా సెటిల్ అయిన శ్రీరామ్ తెలుగులో పెద్దగా ఎందుకు కనిపించలేదు? తాజాగా మీడియాతో శ్రీరామ్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Sriram

Sriram

శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్. తెలుగులో శ్రీరామ్‌గా గుర్తింపు పొందారు. శ్రీరామ్ మొదట కె. బాలచందర్ టీవీ సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చారు. 2002 లో వెండితెరపై కనిపించిన మొదటి సినిమా ‘రోజా కూటం’. ఈ సినిమా ‘రోజా పూలు’ గా తెలుగులో డబ్ చేశారు. ఆ తరువాత ఏప్రిల్ మధతిల్, మనసెల్లం, పార్తిబన్ కనవు వంటి తమిళ్ సినిమాలతో దూసుకుపోయారు. శ్రీరామ్‌కి తెలుగులో ఆఫర్ వచ్చిన సినిమా ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’. గాయాల కారణంగా శ్రీరామ్ ఈ సినిమాను తిరస్కరించడంతో ఆ అవకాశం హీరో రవితేజకు దక్కిందట.

‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ మాస్ మహరాజా రవితేజకు కెరియర్‌ను టర్నింగ్ తిప్పిన సినిమా. ఆ తర్వాత పూరీ మరో సినిమా ‘ఇడియట్’ తో రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. శ్రీరామ్ 2003 లో ‘ఒకరికి ఒకరు’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అయితే ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా తను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో తాజాగా శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Leo Movie : విజయ్ ‘లియో’ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.. ఏ ఓటీటీలో? ఎప్పట్నించి?

కోన వెంకట్ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఒకరికి ఒకరు కథలకు శ్రీరామ్‌ను ఎంపిక చేసారుట. శ్రీరామ్ ముందు ఒకరికి ఒకరు సైన్ చేసాక.. రెండో సినిమాగా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయికి సైన్ చేసారట. రెండు సినిమాల ప్రకటన అయిపోయిందట. అయితే త్రిషతో చేస్తున్న ‘మనసెల్లాం’ అనే సినిమా షూటింగ్ చేస్తున్న టైమ్‌లో శ్రీరామ్ గాయాలపాలయ్యారట. ఆ సినిమాలో ఫైటింగ్ చేయాల్సిన సీన్స్ ఉండటం.. తాను అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫైటింగ్ చేసేందుకు సిద్ధంగా లేకపోవడంతో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా నుంచి బయటకు వచ్చేసారట శ్రీరామ్. తన అవకాశం రవితేజకు రావడం పట్ల ఆయన చాలా హ్యాపీ ఫీలయ్యారని చెప్పారు శ్రీరామ్.

శ్రీరామ్ గాయాల కారణంగా వదులుకున్న సినిమాల్లో మణిరత్నం సినిమాతో పాటు చాలా ప్రాజెక్టులు ఉన్నాయట. తను అప్పుడు ఉన్న పరిస్థితిని చూసి చాలామంది శ్రీరామ్ మళ్లీ సినిమాలు చేయలేడని అన్నారని, తను హాస్పిటల్ లో ఉన్నప్పుడు 9 సినిమాలకు సంబంధించి నిర్మాతలకు అడ్వాన్సులు తిరిగి ఇచ్చానని శ్రీరామ్ చెప్పారు. కానీ దేవుడు కరుణించి కొత్త జీవితాన్ని ప్రసాదించాడని చెప్పారు శ్రీరామ్. అయితే తెలుగులో మాత్రం ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని అందుకే తమిళంకి పరిమితం అయ్యానని చెప్పారు. ఇప్పటికైనా మంచి పాత్రలు వస్తే తెలుగులో చేయాలని ఉందని చెప్పారు శ్రీరామ్.  శ్రీరామ్ తెలుగులో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, దడ, వై, అసలేం జరిగింది, రావణాసురుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించారు.

Hrithika Srinivas : ఒకప్పటి హీరోయిన్ ఆమని కోడలు.. హీరోయిన్‌గా బిగ్‌బాస్ సన్నీ పక్కన..