Hrithika Srinivas : ఒకప్పటి హీరోయిన్ ఆమని కోడలు.. హీరోయిన్‌గా బిగ్‌బాస్ సన్నీ పక్కన..
ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించింది. సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Hrithika Srinivas Shares Interesting Things in Interview about Sound Party Movie
Hrithika Srinivas : బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 5 విన్నర్, నటుడు VJ సన్నీ(VJ Sunny) హీరోగా మూడో సినిమా ‘సౌండ్ పార్టీ'(Sound Party) రాబోతున్న సంగతి తెలిసిందే. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా VJ సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్రలు నిర్మాతగా సంజయ్ శేరి దర్శకత్వంలో సౌండ్ పార్టీ తెరకెక్కుతుంది.
ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించింది. సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
హ్రితిక శ్రీనివాస్ తన గురించి మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశాను. సీనియర్ నటి ఆమని మా అత్త అవుతుంది. ఆమెతో చిన్నప్పట్నుంచి మంచి బంధం ఉండటంతో సినిమాలపై మరింత ఆసక్తి నెలకొంది. గతంలో తెలుగులో అల్లంత దూరాన అనే ఓ సినిమా చేశాను. ఇప్పుడు సౌండ్ పార్టీ సినిమాతో రాబోతున్నాను అని తెలిపింది.

Also Read : Bullet Bhaskar : బుల్లెట్ భాస్కర్ పై ఫైర్ అయిన ఖుష్బూ.. జబర్దస్త్ స్టేజిపై గుండు కొట్టించుకున్న భాస్కర్..
ఇక సినిమా గురించి, అందులో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. క్రికెట్ లో లాస్ట్ లో ధోని వచ్చి సిక్స్ లు కొట్టి మ్యాచ్ ఎలా మారుస్తాడో నేను కూడా లాస్ట్ లో క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చి కథని మారుస్తాను. ఇందులో సిరి అనే పాత్రలో తెలివైన అమ్మాయిగా నటిస్తున్నాను. ఈ సినిమాలో బిట్ కాయిన్ గురించి, డబ్బుల గురించి ఉంటుంది. ఫుల్ కామెడీ సినిమా. నా పాత్ర కూడా హీరోతో కలిసి కామెడీ పండిస్తోంది. సన్నీ నాకు తెలుగు నేర్చుకోవడంలో చాలా సపోర్ట్ చేశాడు అని తెలిపింది.