Bullet Bhaskar : బుల్లెట్ భాస్కర్ పై ఫైర్ అయిన ఖుష్బూ.. జబర్దస్త్ స్టేజిపై గుండు కొట్టించుకున్న భాస్కర్..

తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో జడ్జిగా ఉన్న ఖుష్బూ బుల్లెట్ భాస్కర్ పై ఫైర్ అయింది.

Bullet Bhaskar : బుల్లెట్ భాస్కర్ పై ఫైర్ అయిన ఖుష్బూ.. జబర్దస్త్ స్టేజిపై గుండు కొట్టించుకున్న భాస్కర్..

Kushboo Fires on Bullet Bhaskar in Jabardasth Show Video Goes Viral

Updated On : November 20, 2023 / 9:20 AM IST

Jabardasth Bullet Bhaskar : పలు టీవీ షోలలో అప్పుడప్పుడు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటాయి. దాదాపు 10 ఏళ్లుగా కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది జబర్దస్త్(Jabardasth). ఈ షోతో ఎంతోమంది కమెడియన్లు పరిచయమయ్యారు. ఎంతోమంది సక్సెస్ అయ్యారు. స్కిట్స్ చేసే వాళ్ళు మారినా, యాంకర్లు మారినా, జడ్జీలు మారినా ఇప్పటికి కూడా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ రెండు షోలు దూసుకుపోతున్నాయి.

ఈ షోలలో అప్పుడప్పుడు జడ్జీలు, కమెడియన్లు అలిగి మధ్యలో వెళ్లిపోయిన సందర్భాలు, స్టేజి మీదే సాహసాలు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో జడ్జిగా ఉన్న ఖుష్బూ బుల్లెట్ భాస్కర్ పై ఫైర్ అయింది. బుల్లెట్ భాస్కర్ టీం ఈ సారి నిజం స్పూఫ్ స్కిట్ ని తీసుకున్నారు. ఇందులో గోపీచంద్ పాత్రని భాస్కర్ చేశాడు.

అయితే జడ్జి కృష్ణ భగవాన్(Krishna Bhagavan).. నిజం సినిమాలో గోపీచంద్ కి గుండు ఉంటుంది నీకు లేదేంటి అని అన్నాడు. దీనికి భాస్కర్.. అది ముందు చెప్పాలి, స్కిట్ మధ్యలో అడిగితే ఎలా అని కోపం తెచ్చుకున్నాడు. దీంతో ఖుష్బూ(Kushboo).. స్పూఫ్ చేస్తే కరెక్ట్ గా చేయాలి అని అంది. భాస్కర్ కి కోపం వచ్చి.. నేను స్కిట్ కోసం ప్రాణం పెడతాను గుండు గీయించుకోలేనా అని అక్కడే స్టేజిపైనే గుండు గీయించుకున్నాడు. దీంతో కృష్ణభగవాన్ మేము గుండు ఎఫెక్ట్ ఉంటే చాలు అన్నం. నిజంగానే గుండు గీయించుకోమనలేదు అన్నాడు. భాస్కర్.. ఇది మీరు గుండు గీయించుకోక ముందు చెప్పాలి. ఇప్పుడు చెప్పి ఏం లాభం పోయిన బొచ్చు వెనక్కి రాదుగా అని సీరియస్ అయ్యాడు. దీంతో ఖుష్బూ.. జడ్జి సీట్ లో కూర్చొని మేము ఏం చెప్పకూడదా, మాకు ఫ్రీడమ్ లేదా అంటూ సీరియస్ అయింది. భాస్కర్ ఏదో మాట్లాడబోతుంటే నీతో మాట్లాడట్లేదు అని సీరియస్ అయి ఇద్దరు జడ్జీలు లేచి వెళ్లిపోయారు. దీంతో ప్రోమో సీరియస్ గా ఎండ్ అయింది.

Also Read : Santosham OTT Awards : సంతోషం ఓటీటీ అవార్డ్స్ ఫుల్ లిస్ట్.. సినీ సెలబ్రిటీల మధ్య ఘనంగా వేడుకలు..

అయితే ఇలాంటివి అప్పుడప్పుడు ప్రోమోల కోసం వైరల్ అవ్వడానికి చేస్తూ ఉంటారు. మరి ఇది కూడా అలాగే చేసిందా లేక నిజంగానే గొడవ జరిగి వెళ్లిపోయారా అనేది ఎపిసోడ్ లో చూడాల్సిందే. అయితే భాస్కర్ జబర్దస్త్ స్టేజిపై గుండు కొట్టించుకున్నది మాత్రం నిజం అని తెలుస్తుంది.