Santosham OTT Awards : సంతోషం ఓటీటీ అవార్డ్స్ ఫుల్ లిస్ట్.. సినీ సెలబ్రిటీల మధ్య ఘనంగా వేడుకలు..

తాజాగా సంతోషం ఓటీటీ అవార్డ్స్ రెండో సంవత్సరం హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఘనంగా నిర్వహించారు.

Santosham OTT Awards : సంతోషం ఓటీటీ అవార్డ్స్ ఫుల్ లిస్ట్.. సినీ సెలబ్రిటీల మధ్య ఘనంగా వేడుకలు..

Suresh Kondeti Santosham Second OTT Awards Full List and Details

Santosham OTT Awards : గత ఇరవై ఒక్క ఏళ్లుగా నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి(Suresh Kondeti) ఆధ్వర్యంలో సంతోషం అవార్డ్స్ ఘనంగా జరుగుతున్నాయి. గత సంవత్సరం తెలుగులో మొదటిసారిగా ఓటీటీ అవార్డులు కూడా ఇచ్చారు. త్వరలో 22వ సారి సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ జరగనున్నాయి. ఇవి మరింత గ్రాండ్ గా గోవాలో నిర్వహించనున్నారు. తాజాగా సంతోషం ఓటీటీ అవార్డ్స్ రెండో సంవత్సరం హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఘనంగా నిర్వహించారు.

సంతోషం ఓటీటీ అవార్డు వేడుకలకు యాంకర్ రవి, ఇమ్మాన్యుయేల్, వర్ష యాంకరింగ్ చేయగా పలువురు సినీ, బిజినెస్ ప్రముఖులు హాజరయ్యారు. సిమ్రాన్ గుప్తా, డింపుల్ హయతి.. పలువురు హీరోయిన్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చారు. మురళీమోహన్, జయసుధ, విజయేంద్రప్రసాద్, SV కృష్ణారెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, డింపుల్ హయతి, డైరెక్టర్ వసిష్ఠ, నిర్మాత SKN, అనూప్ రూబెన్స్, జెడి చక్రవర్తి, అనసూయ, ఓంకార్, డైరెక్టర్ సాయి రాజేష్, హంసానందిని, నిరుపమ్, హీరో వేణు.. ఇలా అనేకమంది సినీ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. వీరితో పాటు అవార్డు గ్రహీతలు కూడా వచ్చారు.

Suresh Kondeti Santosham Second OTT Awards Full List and Details

Also Read : Santosham Awards : 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్.. ఈసారి ఘనంగా గోవాలో..

సంతోషం ఓటీటీ అవార్డ్స్ ఫుల్ లిస్ట్

ఉత్తమ చిత్రం – ప్రేమ విమానం
ఉత్తమ నటుడు – జెడి చక్రవర్తి(దయ సిరీస్)
క్రిటిక్స్ ఉత్తమ నటుడు – వేణు(అతిధి సిరీస్)
ఉత్తమ నూతన దర్శకుడు – ఓంకార్ (మ్యాన్షన్ 24 సిరీస్)
ఉత్తమ దర్శకుడు – ఆనంద్ రంగ(వ్యవస్థ)
ఉత్తమ నూతన సహాయనటుడు – శ్రీనివాస్ గవిరెడ్డి(కుమారిశ్రీమతి)
ఉత్తమ సహాయనటుడు – జోష్ రవి (దయ)
ఉత్తమ సహాయ నటి – అనసూయ(ప్రేమ విమానం)
ఉత్తమ విలన్ – సుహాస్ (యాంగర్ టెయిల్స్)
ఉత్తమ సంగీత దర్శకుడు – అనూప్ రూబెన్స్ (నిషాని)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – వివేక్ కాలెపు(దయ)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ – అనిరుధ్, దేవాన్ష్(ప్రేమ విమానం)