Leo Movie : విజయ్ ‘లియో’ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.. ఏ ఓటీటీలో? ఎప్పట్నించి?

లియో(Leo) సినిమా థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా లియో సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.

Leo Movie : విజయ్ ‘లియో’ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.. ఏ ఓటీటీలో? ఎప్పట్నించి?

Vijay Leo Movie OTT Streaming Date and Details Here

Updated On : November 20, 2023 / 10:24 AM IST

Leo Movie : లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్(Vijay) హీరోగా తెరకెక్కిన ‘లియో’ సినిమా దసరా(Dasara) కానుకగా అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్, గౌతమ్ మీనన్, అర్జున్, మడోన్నా సెబాస్టియన్.. మరింతమంది స్టార్ యాక్టర్స్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాపై ముందు నుంచి తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

లియో(Leo) సినిమా థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగులో కూడా దాదాపు 30 కోట్ల వరకు వసూలు చేసింది లియో సినిమా. దీంతో విజయ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తాజాగా లియో సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.

Also Read : Hrithika Srinivas : ఒకప్పటి హీరోయిన్ ఆమని కోడలు.. హీరోయిన్‌గా బిగ్‌బాస్ సన్నీ పక్కన..

లియో సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కేవలం ఇండియాలో మాత్రమే నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. మిగతా దేశాల్లో నవంబర్ 28 నుంచి ఈ అయిదు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో లియో సినిమా థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసేయడానికి రెడీ అయిపోయారు. విజయ్ అభిమానులు ఓటీటీలో కూడా మరోసారి చూసి ఇక్కడ కూడా రికార్డ్స్ సెట్ చేయాలని చూస్తున్నారు.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)