శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రల్లో వీర్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ సినిమా ‘మరణం’. కర్మ పేస్(Karma Pays) ఉపశీర్షిక. ఈ సినిమా టీజర్‌ను అగ్ర నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. సినిమాలో పని చేసిన దర్శకుడు హీరో వీర్ సాగర్‌కి హీరోయిన్ శ్రీ రాపాకకి మరియు సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కి మంచి భవిష్యతు ఉంటుందని, ఉండాలని” ఆశీర్వదించారు.
హార్రర్ చిత్రాల్లో మంచి కంటెంట్ ఉంటే, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని, మంచి కథ కుదిరితే వీర్ సాగర్ మరియు శ్రీ రాపాక కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చారు సీ కళ్యాణ్. దర్శకుడు హీరో వీర్ సాగర్ మాట్లాడుతూ.. “సి కళ్యాణ్ గారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వారని, కష్టాల్లో ఉన్నపుడు నాకు సహాయం చేశారని, జీవితాంతం కళ్యాణ్ గారికి రుణపడి ఉంటానన్నారు. మంచి మనసున్న కళ్యాణ్ నా సినిమా టీజర్‌ను విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం శ్రీ రాపాక మాట్లాడుతూ.. కళ్యాణ్ గారు మా లాంటి చిన్న నటి నటులు, టెక్నిషన్స్‌కి గాడ్ ఫాదర్. ప్రతి విషయంలోనూ హెల్ప్ చేస్తారు.. నేను కథను నమ్ముతాను, వీర్ సాగర్ కథ నచ్చి సినిమా చేస్తున్నాను. సినిమా బాగా వస్తోంది. వీర్ సాగర్ చాలా హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. నేను ఈ సినిమా చేస్తునప్పుడే డైరెక్టర్ నాకు ఇంకో కథ చెప్పారు, అది నాకు బాగా నచ్చింది, సి. కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా నచ్చుతుందని, సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని అన్నారు.