Milind Safai : సినీ పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడి మృతి
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్ (Milind Safai) కన్నుమూశారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. మిలింద్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : August 25, 2023 / 06:07 PM IST
Marathi Actor Milind Safai : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్ (Milind Safai) కన్నుమూశారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. మిలింద్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10.45 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు జయవంత్ వాడ్కర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పాటు సంతాపం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మిలింద్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
Bhagavanth Kesari : భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్.. ‘గణేష్ అంథెమ్’కి టైం ఫిక్స్.. ఎప్పుడంటే..?
‘ఆయ్ కుతే కే కర్తే’ సీరియల్ ద్వారా మిలింద్ సఫాయ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు చిత్రాల్లోనూ నటించారు. ‘మేకప్’, ‘థాంక్ యు విఠలా’, ‘పోస్టర్ బాయ్స్’, ‘చడీ లగే చమ్ చమ్’, ‘ప్రేమచి గోష్టా’, ‘టార్గెట్’, ‘బి పాజిటివ్’ వంటి సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశారు.
Jabardasth Shanthi : సర్జరీ కోసం.. ఇంటిని అమ్మేస్తున్న జబర్దస్త్ నటుడు
ఇదిలా ఉంటే.. గురువారం ఆగస్టు 24న ప్రముఖ మరాఠీ నటి సీమా డియో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ముంబైలో తుది శ్వాస విడిచింది. సీమా గతేడాది మరణించిన ప్రముఖ నటుడు రమేష్ డియో భార్య అన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిని కోల్పోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
Allu Arjun : నేషనల్ అవార్డుకు ఎంపికైన ఆనందంలో బన్నీ.. వైరల్ అవుతున్న అల్లు అయాన్ వీడియో..
