×
Ad

Margani Bharat : నాకున్న గ్లామర్‌కి నేను సినిమాల్లో సూపర్ స్టార్ అవ్వగలను.. ఏపీ ఎంపీ మార్గాని భరత్!

ఆంధ్రప్రదేశ్ ఎంపీ మార్గాని భరత్.. ప్రజలకు రాజకీయ నాయకుడిగానే కాదు, సినిమా నటుడిగా కూడా సుపరిచితుడే. గతంలో ఈ లీడర్ 'ఓయ్ నిన్నే' అనే ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించాడు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు, మార్గాని భరత్ సినీ జీవితం గురించి కామెంట్స్ చేశాడు. దీనికి మార్గాని భరత్ కౌంటర్ ఇస్తూ..

  • Published On : March 11, 2023 / 08:16 AM IST

Margani Bharat says he can become a superstar in movies because of his glamour

Margani Bharat : ఆంధ్రప్రదేశ్ ఎంపీ మార్గాని భరత్.. ప్రజలకు రాజకీయ నాయకుడిగానే కాదు, సినిమా నటుడిగా కూడా సుపరిచితుడే. గతంలో ఈ లీడర్ ఒక ఫీచర్ ఫిల్మ్ లో నటించాడు. ‘ఓయ్ నిన్నే’ అనే ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించి అలరించాడు. సత్యం చల్లకొటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2017 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని మార్గాని భరత్ సొంతంగా నిర్మించాడు. తనికెళ్ళ భరణి, నాగినీడు, రఘుబాబు, తాగుబోతు రమేష్, ధన్ రాజ్ వంటి టాలీవుడ్ అగ్ర నటులు ఈ సినిమాలో పని చేశారు.

Ustaad Bhagat Singh : పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ పనులు మొదలు!

ఈ సినిమా తరువాత భారత్ రాజకీయం పై అడుగు వేయడంతో మరో సినిమాలో నటించ లేదు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు, మార్గాని భరత్ సినీ జీవితం గురించి కామెంట్స్ చేశాడు. ‘ఏకచిత్ర నటుడు’ అంటూ కృష్ణంరాజు విమర్శించగా, దీనికి మార్గాని భరత్ కౌంటర్ ఇస్తూ.. ఏక చిత్రం కాకపోతే 10 సినిమాల్లో నటిస్తా. నాకున్న గ్లామర్ కి నన్ను ప్రజలు ఆదరిస్తారు. జగన్ మోహన్ రెడ్డి గారిని పర్మిషన్ అడిగి నేను నటిస్తే సినిమాల్లో సూపర్ స్టార్ ని అవుతాను.

RRR : RRR మూవీ‎పై చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి రియాక్షన్..

నా సినిమాల్లో నీకు ఒక పాత్ర ఇస్తాను. నువ్వు ఒక గోచి కడతావు కదా. నా సినిమాలో ఒక కామెడియన్ పాత్ర ఇస్తాను. అరిటాకు గోచీ కట్టుకొని వచ్చి కామెడీ చెయ్యి, నీకంటే పెద్ద కమెడియన్ ఎవరు ఉండరు అంటూ రఘు రామ కృష్ణంరాజు విమర్శలను తిప్పుకోట్టాడు. కాగా ఇటీవల మార్గాని భరత్ సినీ భావిస్తా గురించి ప్రశ్నించగా.. ప్రస్తుతం దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటూ వెల్లడించాడు.