Marimuthu : వారం రోజుల క్రితమే వెడ్డింగ్ యానివర్సరీ.. ఇప్పుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి..

మరిముత్తు ఇటీవలే ఆరు రోజుల క్రితం సెప్టెంబర్ 2న తన భార్యతో కలిసి 27వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా చేసుకున్నారు.

Marimuthu Tamil Star Actor Passed Away with Heart attack

Marimuthu :  ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. పలువురు సినీ ప్రముఖుల మరణంతో విషాదం నింపుతున్నారు. తాజాగా తమిళ పరిశ్రమలో తమిళ్ సీనియర్ నటుడు, దర్శకుడు మరిముత్తు నేడు ఉదయం గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. దీంతో తమిళ సినీ ప్రముఖులు, ప్రేక్షకులు షాక్ అయ్యారు.

1999లో అజయ్ వాలి సినిమాతో మరిముత్తు నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తమిళ్ లో దాదాపు 80 సినిమాలకు పైగా నటించి మెప్పించాడు. పలు సీరియల్స్ లో కూడా నటించాడు. అలాగే డైరెక్టర్ గా కూడా మూడు సినిమాలు తెరకెక్కించాడు మరిముత్తు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న మరిముత్తు ఇటీవలే చివరిసారిగా రజినీకాంత్ జైలర్ సినిమాలో విలన్ పక్కనే ఉండే పాత్రలో నటించి మెప్పించాడు.

Marimuthu : గుండెపోటుతో తమిళ్ స్టార్ నటుడు కన్నుమూత.. ఇటీవలే జైలర్ సినిమాతో..

మరిముత్తు ఇటీవలే ఆరు రోజుల క్రితం సెప్టెంబర్ 2న తన భార్యతో కలిసి 27వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా చేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన 56 ఏళ్ళ వయసులో కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ నేడు ఉదయం అకస్మాత్తుగా గుంటుపోటుతో మరిముత్తు మరణించడంతో తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆయన కుటుంబంలో త్రీవ్ర శోకం నెలకొంది..