Mark K Robin
Mark K Robin : ‘అ’ సినిమాతో సిచ్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు మార్క్ కె రాబిన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మాణంలో వచ్చిన ఆ సినిమా, ఆ సినిమాలోని మ్యూజిక్ ప్రేక్షకులను మెప్పించాయి. అక్కడ్నుంచి వరుస సినిమాలు చేస్తున్నాడు మార్క్ కె రాబిన్. జాంబీ రెడ్డి, మిషన్ ఇంపాజిబుల్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మల్లేశం, మళ్ళీ కలుద్దాం, సూర్యకాంతం.. ఇలా దాదాపు 20 సినిమాలకు మ్యూజిక్ అందించాడు. వీటిలో చాలా సూపర్ హిట్ సినిమాలు, పాటలు ఉన్నాయి.
8AM మెట్రో అనే సినిమాతో బాలీవుడ్ లోకూడా ఎంట్రీ ఇచ్చాడు మార్క్ కె రాబిన్. ఇప్పటికే సైమా బెస్ట్ మ్యూజిక్ అవార్డు, నోయిడా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, మిర్చి మ్యూజిక్ బెస్ట్ అప్ కమింగ్ కంపోజర్ అవార్డు, బెస్ట్ కంపోజర్ మిర్చి మ్యూజిక్ అవార్డ్, బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా ఐరా అవార్డు.. ఇలా పలు అవార్డులు సాధించాడు.
Also Read : Prabhas : మలయాళం దర్శకుడితో ప్రభాస్ సినిమా.. రొయ్యల బిర్యానీ పెట్టి మరీ..
ఇప్పుడు దండోరా సినిమాకు గాను మార్క్ కె రాబిన్‌కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు ప్రకటించారు. ఆ సినిమాలో ఇచ్చిన ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలకు మంచి పేరొచ్చింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోతెరకెక్కిన సినిమాలోని మ్యూజిక్ కి ఇప్పుడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు రావడం గమనార్హం.
దీనిపై మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచి గద్దర్ పాటలు ఇష్టం. అవి పాటలు కాదు ఫైర్. ఆయన పాటలు వింటూ పెరిగిన నాకు ఇవాళ గద్దర్ అవార్డు రావడం ఆనందంగా ఉండి. నాకు ఈ అవార్డుని, గుర్తింపును ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంకు, సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి, జ్యూరీ మెంబర్లకు ధన్యవాదాలు. నాకు ఈ దండోరా సినిమా ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అని తెలిపారు.
Also Read : Vijay Rashmika : పెళ్ళికొడుకు పెళ్లికూతురు వేడుకల ఫోటోలు షేర్ చేసిన విజయ్ – రష్మిక.. ఎంత క్యూట్ గా ఉన్నారో..