Vasudheva Sutham Trailer : ‘వసుదేవసుతం’ ట్రైలర్ రిలీజ్.. మరో డివోషనల్ థ్రిల్లర్..

మీరు కూడా వసుదేవసుతం ట్రైలర్ చూసేయండి.. (Vasudheva Sutham Trailer)

  • Published on- June 23, 2026 / 07:26 PM IST

Vasudheva Sutham

Vasudheva Sutham Trailer : మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా తెరకెక్కుతున్న సినిమా వసుదేవసుతం. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. వసుదేవసుతం సినిమా జూలై 10న రిలీజ్ కానుంది.

ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం, ఆ ఆలయంలోని బ్రహ్మ పదార్థం కోసం శత్రు మూకలు చేసే విధ్వంసం, దాన్ని అడ్డుకునే హీరో చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుంది. ‘దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు’.. అనే పవర్ ఫుల్ డైలాగ్స్, కొన్ని విజువల్స్ బాగున్నాయి. మీరు కూడా వసుదేవసుతం ట్రైలర్ చూసేయండి..

Also Read : Ram Charan : పీఎం మోదీతో రామ్ చరణ్ – ఉపాసన.. ఫొటోలు వైరల్..

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. వసుదేవసుతం కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు, ఖర్చుపెట్టారు. కృష్ణుడి మీద తీసిన ఈ సినిమా జనాలకు నచ్చాలని బాగా తెరకెక్కించారు. ఇలాంటి పాత్ర, సినిమా దొరకడం నా అదృష్టం. నిర్మాత మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్‌ కూడా అడగలేదు అని అన్నారు. డైరెక్టర్ వైకుంఠ్ బోను మాట్లాడుతూ.. నిర్మాత గారికి ముందు చెప్పిన రెండు కథలు నచ్చినా ఒరిస్సాలోని ఫేమస్ టెంపుల్ బ్యాక్ డ్రాప్‌లో రాసుకున్న ఈ కథ చెప్పగానే అవి పక్కన పెట్టి ఇదే తీద్దామన్నారు నిర్మాత. మణిశర్మ గారికి కథ నచ్చి మా సినిమా చేసారు. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చాయి చివరి 45 నిమిషాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది అని అన్నారు.

నిర్మాత త్రినాథ్ కేశవ మాట్లాడుతూ.. ఇది మా మొదటి సినిమా. మా సినిమా జూలై 10న రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు. హీరోయిన్ అంబికా వాణి మాట్లాడుతూ.. నాకు తెలుగు సరిగ్గా రాలేదు. నేను నేర్చుకుంటాను. నాకు భాష రాకపోయినా అందరూ నాకు సపోర్ట్ చేశారు అని తెలిపింది.