Ram Charan : పీఎం మోదీతో రామ్ చరణ్ – ఉపాసన.. ఫొటోలు వైరల్..
పీఎం మోదీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు చరణ్. (Ram Charan)
Ram Charan
Ram Charan : ఇటీవలే పెద్ది సినిమాతో సక్సెస్ సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నారు రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్ ఢిల్లీలో జరిగిన ఓ నేషనల్ మీడియా సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో తన భార్య ఉపాసనతో కలిసి చరణ్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ – ఉపాసనలు పీఎం మోదీని కలిసి మాట్లాడారు, మోదీ కూడా చరణ్, ఉపాసనలను పలకరించారు. పీఎం మోదీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు చరణ్.

Also Read : Anish Kuruvilla : మేము పెళ్లి చేసుకోము.. తనతో లివ్ ఇన్ రిలేషన్.. నటుడు వ్యాఖ్యలు వైరల్..
మోదీతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. రిపబ్లిక్ సమ్మిట్ 2026లో గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారిని కలవడం ఒక గొప్ప గౌరవం. వికసిత్ భారత్ పట్ల ఆయనకున్న దార్శనికత మరియు భారతదేశానికే ప్రథమ ప్రాధాన్యత విధానంపై ఆయన ఉంచిన ఉద్ఘాటన నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. పౌరులుగా మన బాధ్యతను అవి శక్తివంతంగా గుర్తుచేశాయి. ఈ సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు అర్ణబ్ గోస్వామి బృందానికి ధన్యవాదాలు అని తెలిపారు. దీంతో పీఎం మోదీ – చరణ్ ఫొటోలు వైరల్ గా మారాయి.
