Anish Kuruvilla : మేము పెళ్లి చేసుకోము.. తనతో లివ్ ఇన్ రిలేషన్.. నటుడు వ్యాఖ్యలు వైరల్..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనీష్ కురువిళ్ళ మాట్లాడుతూ.. (Anish Kuruvilla)
Anish Kuruvilla
Anish Kuruvilla : ఇటీవల ఇండియాలో కూడా లివ్ ఇన్ రిలేషన్స్ సాధారణం అయిపోతున్నాయి. తాజాగా సీనియర్ నటుడు, దర్శకుడు లివ్ ఇన్ రిలేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. శేఖర్ కమ్ముల ఫ్రెండ్, నటుడు, దర్శకుడు అనీష్ కురువిళ్ళ నటుడిగా ఎంతో ఫేమ్ తెచ్చుకున్నాడు. దర్శకుడిగా కూడా పలు సినిమాని తెరకెక్కించాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో నటుడిగానే బిజీగా ఉన్నాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనీష్ కురువిళ్ళ మాట్లాడుతూ.. నాకు ఒక మంచి పార్టనర్ ఉంది. నా గర్ల్ ఫ్రెండ్ తను. మంచి అమ్మాయి. మేము సీరియస్ రిలేషన్ షిప్ లోనే ఉన్నాము. గ్రేట్ రిలేషన్ షిప్ మాది. మేము పెళ్లి చేసుకోము. చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. లివ్ ఇన్ రిలేషన్ లాంటిదే. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము, ఇలాగే ఉండాలి అనుకుంటున్నాము. ఇలాగే హ్యాపీగా ఉన్నాము. మ్యారేజి అనే సీరియస్ నెస్ మాకు వద్దు అనుకుంటున్నాము అని అన్నారు.
Also See : Shalini Kondepudi : సింగ్ గీతం సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన షాలిని కొండేపూడి..
దీంతో ఈ 46 ఏళ్ళ నటుడు పెళ్లి చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాము అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
