Mathu Vadalara 2 Movie Fame Riya Character Isha Yadav Details Here
Mathu Vadalara 2 Riya : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రియా ఎవరు అని ట్రెండింగ్ అవుతుంది. సింహ, ఫరియా అబ్దుల్లా నటించిన మత్తు వదలరా 2 సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులని ఫుల్ గా మెప్పించింది. తాజాగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అయితే ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమాలోని ఒక సీన్ బాగా వైరల్ అవుతుంది. రియా అనే అమ్మాయిని వెతికే క్రమంలో అజయ్, సత్య మధ్య రియా ఎవరు? – దామిని డాటర్ – దామిని ఎవరు – రియా మదర్ – వాళ్లిద్దరూ ఎవరూ? – డాటర్ & మదర్ అనే సీన్ ఫన్నీగా ఉంటుంది. ఆ సీన్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.
4K#MathuVadhalara2 #riya #comedy #riyaekada pic.twitter.com/aOTk4X1lIp
— Kirak KC (@kcskylevel) October 18, 2024
దీంతో మత్తు వదలరా 2 సినిమాలో రియా పాత్రలో చేసిన అమ్మాయి ఎవరు అని సోషల్ మీడియా అంతా ప్రశ్నిస్తుంది. ఆ సినిమాలో రియా పాత్రలో ఓ అమ్మాయి వెన్నెల కిషోర్ తో కలిసి ఓ సీన్ చేయగా అది కూడా వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్ ఏంటి? అంటూ రియా ఎవరు అని బాగా వైరల్ చేస్తున్నారు. ఏకంగా నేషనల్ వైడ్ రియా ఎవరు అని ట్రెండ్ అయింది. దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా ఈ రియా ఎవరు అనే టెంప్లెట్ ని తమ సినిమాలకు కూడా వాడుకొని ప్రమోషన్స్ చేసుకుంటున్నారు..
Also Read : Teja Sajja : ‘మిరాయ్’ సినిమా కోసం తేజ సజ్జ సాహసం.. డూప్ లేకుండా ట్రైన్ యాక్షన్స్ చేసి చేతికి గాయంతో..
రియా ఎవరు అని వైరల్ చేయడంతో అందరూ వెతికి మరీ రియాని పట్టుకున్నారు. దీంతో ఇప్పుడు మొత్తానికి రియా దొరికింది అని రియా ఫొటోలు పెట్టి మళ్ళీ ఆ అమ్మాయిని వైరల్ చేస్తున్నారు. రియా పాత్రలో నటించింది ఇషా యాదవ్. నార్త్ ఇండియాకు చెందిన అమ్మాయి. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బాగా పాపులర్ అయింది. పలు షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్, ఓ సిరీస్ లో కూడా నటించింది. ఇషా యాదవ్ కు మత్తు వదలరా 2నే మొదటి సినిమా.
సినిమా రిలీజయినప్పుడు తెలుగులో మాట్లాడుతూ ఓ వీడియో కూడా షేర్ చేసింది ఇషా యాదవ్. మత్తు వదలరా 2 సినిమా షూటింగ్ అనుభవాలు చెప్తూ తన మొదటి సినిమా అని, తనకు సపోర్ట్ చేసిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పింది. రియా ఎవరు అనే వైరల్ దెబ్బకి ఇషా యాదవ్ తెలుగులో అయితే బాగా పాపులర్ అయింది. తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్ దొరకడంతో తెలుగు యువత ఆమెని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఇషా యాదవ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.