Matka Kubera Fauji And So Many Movies Shooting Updates
Movie Shooting Updates : మన హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్, బాలకృష్ణ, నాగార్జున, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో ఓ సారి తెలుసుకుందాం..
* ప్రభాస్.. హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. ఈ చిత్ర షూటింగ్ కరైకుడిలో జరుగుతుంది.
* బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న సినిమా షూటింగ్ చౌటుప్పల్‌లో జరుగుతుంది.
* నాగార్జున ధనుష్ కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా కుబేర. ఈ సినిమా షూటింగ్ సికింద్రాబాద్ లో జరుగుతుంది.
* విజయ్ దేవరకొండ గౌతం తిన్నసూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
* సాయిధరంతేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో వహిస్తున్న సినిమా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
Anushka Shetty : సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. సైలెంట్ గా పని చేస్తున్న అనుష్క..
* జొన్నలగడ్డ సిద్దు, నీరజ కోన దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర పల్లి లో జరుగుతుంది.
* వరుణ్ తేజ్ కరుణకుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న మట్కా సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.