కరోనా బారిన తారలు.. ఆగుతున్న షూటింగ్‌లు
- vamsi
- Published On : April 18, 2021 / 12:33 PM IST
Movie Shootings
Movie Shootings: సినిమా ఇండస్ట్రీని కరోనా వైరస్ కుదిపేస్తోంది. వరుసగా అగ్ర తారలతో పాటు బడా నిర్మాతలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నివేదా థామస్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు కూడా కరోనా బారిన పడ్డారు.
వారం వ్యవధిలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా తెలిపారు. ఇంకోపక్క గతంలో కరోనా బారిన పడి కోలుకున్న నిర్మాత బండ్ల గణేష్ కూడా మరోసారి వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. దర్శకుడు వీఎన్ ఆదిత్యతో పాటు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కరోనాతో ఇళ్లకే పరిమితమయ్యారు.
అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్న అనిల్.. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. దీంతో ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 మూవీ వాయిదా పడింది. ఇవే కాదు.. ఇంకా ఎందరో సినీ తారలు కరోనా బారిన పడుతుండడంతో.. షూటింగ్‌లకు అంతరాయం కలిగి ఆగిపోతున్నాయి.
