CM Vijay : మళ్ళీ నీళ్ల వివాదం.. సీఎం సినిమాకు షాక్ ఇచ్చిన కర్ణాటక..
తాజాగా గత కొన్ని రోజుల నుంచి ఈ కావేరి నీళ్ల వివాదం మళ్ళీ మొదలైంది. (CM Vijay)
CM Vijay
CM Vijay : తమిళనాడు – కర్ణాటక మధ్య ఎన్నో ఏళ్లుగా కావేరి నది జలాల కోసం వివాదం సాగుతూనే ఉంది. గతంలో కావేరి నీళ్ల కోసం తమిళనాడు, కర్ణాటకలో ఎన్నో ధర్నాలు జరిగాయి. రాజకీయంగా కూడా రెండు రాష్ట్రాల నాయకులు ఈ విషయంలో విమర్శలు చేస్తూ ఉంటారు. తమిళనాడు హీరోలు, హీరోయిన్స్, సినిమా స్టార్స్ కూడా గతంలో కావేరి నీళ్ల కోసం ధర్నాలు చేసారు.
తాజాగా గత కొన్ని రోజుల నుంచి ఈ కావేరి నీళ్ల వివాదం మళ్ళీ మొదలైంది. తమిళనాడు తమ వాటా నీళ్లను విడుదల చేయాలని కోరగా కర్ణాటక ఇంకా దానిపై నిర్ణయం తీసుకోకుండా చర్చిస్తుంది. ఈ విషయంలో కర్ణాటకలో, తమిళనాడులో ఆందోళనలు మొదలయ్యాయి. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదంలో ఇప్పుడు హీరో విజయ్ చిక్కుకున్నారు. ఆయన తమిళనాడు సీఎం అవ్వడంతో ఇటీవల రిలీజయిన విజయ్ లాస్ట్ సినిమా జన నాయగాన్ షోలు కర్ణాటకలో బలవంతంగా ఆపేసారు.
Also Read : Anna Konidala : భర్తను ఫాలో అయిన భార్య.. పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల మంచిమనుసు..
మాండ్య జిల్లాలోలోని ఓ థియేటర్ వద్దకు కర్ణాటక ఆర్గనైజేషన్ కొంతమంది వచ్చి నడుస్తున్న విజయ్ జన నాయగాన్ షోని మధ్యలోనే ఆపేసి ప్రేక్షకులను పంపించేశారు. కర్ణాటకలో పలు చోట్ల జన నాయగాన్ సినిమాకు అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కొన్ని థియేటర్స్ సీఎం విజయ్ జన నాయగాన్ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నారు.
