Patriotic Movies : రెడీ అవుతున్న దేశభక్తి సినిమాలు.. బాలీవుడ్ టు టాలీవుడ్..
బోర్డర్ 2, ధురంధర్ లాంటి పేట్రియాటిక్ మూవీస్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ పేట్రియాటిక్ మూవీస్ కి డిమాండ్ మళ్ళీ పెరిగిపోయింది బాలీవుడ్ లో. (Patriotic Movies)
Patriotic Movies
Patriotic Movies : ఏ సినిమా హిట్ అయినా కాకపోయినా పేట్రియాటిక్ మూవీస్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ. అందుకే ఎప్పుడూ యాక్షన్ సినిమాలు చేసే హీరోలు కూడా పేట్రియాటిజం పాట పాడుతున్నారు. స్టార్ హీరోలు, సీనియర్ హీరోలన్న తేడా లేకుండా పేట్రియాటిజం పాపులర్ అయిపోతోంది సినిమా మార్కెట్లో. బోర్డర్ 2, ధురంధర్ లాంటి పేట్రియాటిక్ మూవీస్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ పేట్రియాటిక్ మూవీస్ కి డిమాండ్ మళ్ళీ పెరిగిపోయింది బాలీవుడ్ లో. స్పెషల్లీ పేట్రియాటిక్ మూవీస్ తో బాగా పేరు తెచ్చుకున్న సన్నీడియోల్ మరో దేశభక్తి సినిమా చేస్తున్నారు.
సన్నీడియోల్, ప్రీతిజింతా లీడ్ రోల్స్ లో బట్వారా 1947 టైటిల్ తో ఆమిర్ ఖాన్ నిర్మాతగా సినిమా చేస్తున్నారు. ఇండో-పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సీజన్ లో ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజవుతోంది. పవర్ ఫుల్ పేట్రియాటిక్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ బట్వారా 1947 మీద బాలీవుడ్ లో అంచనాలు బాగానే ఉన్నాయి.
టైగర్ సిరీస్ తో సల్మాన్ ఖాన్ స్పై గా పవర్ ఫుల్ పేట్రియాటిజం చూపించారు. వీటికి కంటిన్యూషన్ గా ఇప్పుడు మాతృభూమి అనే మరో ఆసక్తికర దేశభక్తి పేట్రియాటిక్ సినిమా చేస్తున్నారు. గాల్వాన్ బ్యాక్ డ్రాప్ లో ఇండియా – చైనా మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సల్మాన్ మిలటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.
Also Read : Venky Atluri : ఏమయ్యా వెంకీ.. ఇంక తెలుగు హీరోలతో సినిమా చేయవా..?
ద ప్రైడ్ ఆఫ్ భారత్.. ఛత్రపతి శివాజీ టైటిల్ తో పవర్ ఫుల్ పేట్రియాటిక్ మూవీ తెరకెక్కుతోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీ రోల్ ప్లే చేస్తున్నారు. శివాజీ అంటేనే పోరాట యోధుడు. అలాంటి పవర్ ఫుల్ పేట్రియాటిక్ క్యారెక్టర్ తో రిషబ్ బాలీవుడ్ లో స్టార్ ఎంట్రీ ఇస్తున్నారు. సందీప్ సింగ్ డైరెక్షన్లో ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 21న రిలీజవుతోంది.
ఈ దేశభక్తి సినిమాలు బాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా వరుస పెట్టి తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రభాస్ ఈ సారి ఆ రూట్ మార్చి పేట్రియాటిక్ సినిమా చేస్తున్నారు. ఫౌజి టైటిల్ తోనే సినిమామీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు ప్రభాస్. హనురాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ సైనికుల్ని లీడ్ చేసే పవర్ ఫుల్ నాయకుడిగా కనిపించబోతున్నారు. 1940 ల్లో ఆజాద్ హింద్ ఫౌజ్ మిలిటరీ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ ఫౌజి సినిమా భారీబడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతోంది.
గోపీచంద్ కూడా భరత వర్ష అనే పవర్ ఫుల్ సినిమాతో పోరాటయోధుడిగా రాబోతున్నారు. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో గోపీచంద్ చేస్తున్న సినిమా 7వ శతాబ్ధానికి చెందిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. మాతృభూమిని కాపాడుకోవడానికి చేసే పోరాటంతోనే ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన గోపీచంద్ టీజర్, హీరోయిన్ గా రీతూవర్మ లుక్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.
Also Read : Rajmouli : మాకు నమ్మకం లేదు దొర.. రాజమౌళి మహేష్ బాబు సినిమాపై ఫ్యాన్స్ కూడా..
రౌడీ హీరోగా యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు పవర్ ఫుల్ మూవీస్ చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో తెరకెక్కుతున్న రణబాలి సినిమాని పేట్రియాటిక్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. 19వ శతాబ్థంలో బ్రిటిష్ కాలంలో ఫ్రీడమ్ ఫైటర్ రోల్ లో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. విజయ్ కెరీర్ లో ఫస్ట్ పేట్రియాటిక్ పీరియాడిక్ మూవీ కాబట్టి ఇంకాస్త హైప్ పెరిగిపోతోంది.
ఆల్రెడీ పేట్రియాటిక్ మూవీస్ చేసి హిట్లు కొట్టాడు అడివిశేష్. తెలుగులో డిఫరెంట్ స్పై మూవీస్ చేస్తున్న అడివి శేష్ ఈ రూట్లోనే మరో ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నారు. పవర్ ఫుల్ స్పై గా చేసిన గూఢచారి మూవీ హిట్ అవ్వడంతో గూఢచారి 2 కూడా చేస్తున్నాడు శేష్. ఈ సినిమాలో పేట్రియాటిజం చూపించే పవర్ ఫుల్ స్పై ఏజెంట్ గోపి 116 క్యారెక్టర్ చేస్తున్నారు అడివి శేష్. భారీ బడ్జెట్ తో శేష్ హీరోగా, ఇమ్రాన్ హష్మి ఇంపార్టెంట్ రోల్ లో తెరకెక్కుతున్న గూఢచారి 2 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
పేట్రియాటిక్ మూవీస్ చెయ్యడానికి నిఖిల్ లాంటి హీరోలు కూడా ముందుకొస్తున్నారు. బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ లో రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ద ఇండియా హౌజ్ సినిమాలో నిఖిల్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాలో స్వాతంత్ర్యం రాకముందు కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉండబోతోంది. 1905 లండన్ తిరుగుబాటు ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు.
Also Read : August Movies : అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ ఆగస్టులో.. సినిమా ఫ్యాన్స్ కి ప్రతి వారం పండగే..
సౌత్ లోనే మోడర్న్ పేట్రియాటిక్ మూవీగా తెరకెక్కుతోంది సర్దార్ 2. కార్తి హీరోగా తెరకెక్కిన సర్దార్ లో పవర్ ఫుల్ స్పై గా అందరినీ ఆకట్టుకున్నాడు. వన్స్ ఎ స్పై ఆల్వేస్ ఎ స్పై అంటూ ఇంట్రస్టింగ్ డైలాగ్ తో తెలుగు ఆడియన్స్ ని కూడా ఎంగేజ్ చేసిన కార్తి సర్దార్ 2ని కంప్లీట్ చేసి సెప్టెంబర్ లో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఈ దేశభక్తి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు బద్దలుకొడతాయో చూడాలి.
