Me Too: వాళ్లను నగ్నంగా నిలబెట్టకపోతే నేను మా నాన్న కూతురినే కాను..

  • Publish Date - September 30, 2020 / 11:33 AM IST

Me Too – Payal Ghosh: నటి పాయల్‌ ఘోష్‌, డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ను తనను బలవంతం చేయబోయాడంటూ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలో చాలామంది పాయల్ కంటే అనురాగ్‌కే మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇతర హీరోయిన్లు ఒకరిద్దరు తాము ఎదుర్కొన్న లైంగిక ఇబ్బందుల గురించి చెబుతున్నారు తప్ప పాయల్‌ను సపోర్ట్ చేయడంలేదు.


మంగళవారం మధ్యాహ్నం మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసిన పాయల్‌ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తనకు వై కేటగిరి భద్రతను కల్పించాలని కోరింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, అందుకే భద్రతను కావాలనుకుంటున్నానని తెలియజేస్తూ గవర్నర్‌కు లేఖ అందజేసిందామె. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. గత రాత్రి ఆమె చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.


‘‘ఫేక్ ఫెమినిస్ట్స్ (Fake feminists) లను వారి ఫ్యామిలీతో సహా నగ్నంగా నడిరోడ్డుపై నిలబెట్టకపోతే నేను మా నాన్న కూతుర్నే కాదు’’.. అంటూ ఆమె కాస్త ఘాటుగా ట్వీట్ చేసింది.

కాగా గవర్నర్‌ను కలిసిన తర్వాత.. ‘‘గౌరవనీయులైన గవర్నర్‌ బీఎస్‌కే కోష్యారీగారిని ఈరోజు కలిశాను. ఆయనతో సమావేశం గొప్పగా జరిగింది. నన్ను ఆపేవాళ్లు, విమర్శించేవాళ్లు, అభ్యంతరం చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నేను వేటికీ ఆగకుండా ముందుకెళ్తాను’’.. అని ట్వీట్ చేసింది పాయల్‌.

ట్రెండింగ్ వార్తలు