Arya As Manas
Saindhav-Arya : విక్టరీ వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న చిత్రం సైంధవ్ (Saindhav). వెంకటేశ్ కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) కీలక పాత్రలో నటిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్ (Niharika Entertainment) ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో మరో నటుడు కూడా కీ రోల్ పోషిస్తున్నాడు. అతడు ఎవరో కాదు ఆర్య (Arya).
Mahesh Babu – Nagarjuna : మహేష్ బాబు పై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్.. నాగార్జున వీడియోతో..!
మానస్ పాత్రలో ఆయన నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ మానస్ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేసింది. లాంగ్ హెయిర్‌తో ఓ తుపాకీ చేతపట్టి నడుచుకుంటూ వస్తున్నట్లు ఆ పోస్టర్ ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Skanda : రామ్ ‘స్కంద’ నుంచి ‘డుమ్మారే డుమ్మా’ లిరికల్
యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా లు కూడా నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుండగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Meet @arya_offl as #MANAS in #SAINDHAV on the big screens from DECEMBER 22nd 🔥#SaindhavOn22ndDEC ❤️🔥 pic.twitter.com/8P05gHCHxQ
— Niharika Entertainment (@NiharikaEnt) August 30, 2023