Konda Polam: మెగా క్రేజ్.. దుమ్మురేపుతున్న ‘కొండపొలం’ ట్రైలర్!
యూట్యూబ్ లో మెగా క్రేజ్ కొనసాగుతుంది. తొలి సినిమాతోనే టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారిన వైష్ణవ్ తేజ్ రెండో సినిమాతో కూడా అదే జోష్ కొనసాగిస్తున్నాడు. వైవిధ్యమైన దర్శకుడిగా పేరున్న..
- Naresh Mannam
- Published On : September 28, 2021 / 11:40 AM IST
Konda Polam
Konda Polam: యూట్యూబ్ లో మెగా క్రేజ్ కొనసాగుతుంది. తొలి సినిమాతోనే టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారిన వైష్ణవ్ తేజ్ రెండో సినిమాతో కూడా అదే జోష్ కొనసాగిస్తున్నాడు. వైవిధ్యమైన దర్శకుడిగా పేరున్న క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కొండపోలం సినిమా నుండి సోమవారం ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, యూట్యూబ్ లో ట్రైలర్ దుమ్మురేపుతూ వ్యూస్ దక్కించుకుంటుంది. సోమవారం సాయంత్రం విడుదలైన ఈ ట్రైలర్ మంగళవారం ఉదయానికి 5 మిలియన్లపైగా వ్యూస్ తో దూసుకెళుతుంది.
Bomma Blockbuster: నీయయ్య పుట్టడానికే ఇన్ని యుద్దాలు చేసిన నీకు లైఫ్ ఒక లెక్కనా?
ఆకట్టుకొనే గ్రామీణ నేపధ్యం, నల్లమల అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ సన్నివేశాలతో కూడుకున్న సన్నివేశాలతో ఈ సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. క్రిష్ లాంటి దర్శకుడికి తోడు కీరవాణి సంగీతం కూడా ప్రేక్షకులను ట్రైలర్ మీద ఆసక్తి రేకెత్తించగా.. అంచనాలకు తగ్గట్లే ట్రైలర్ ఉత్కంఠ కలిగిస్తుండడంతో సూపర్ క్రేజ్ దక్కించుకుంటుంది.
Telugu Film Shooting: జెట్ స్పీడ్‌తో టాలీవుడ్.. ఏ సినిమా ఎక్కడ షూట్‌లో ఉందంటే
గిరిజన ప్రాంతం నేపధ్యంలో నడిచే కథాంశంతో మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తుండగా నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన యువకుడిగా తేజ్.. జోడిగా రకుల్ ప్రీత్ సింగ్, తేజ్ తండ్రి పాత్రలో సాయిచంద్, తాత పాత్రలో కోట శ్రీనివాస్ కనిపించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదల కాబోతుంది.
