Telugu Film Shooting: జెట్ స్పీడ్‌తో టాలీవుడ్.. ఏ సినిమా ఎక్కడ షూట్‌లో ఉందంటే

కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ ఇప్పుడు జెట్ స్పీడ్ మీదుంది. ఒక వైపు రిలీజ్ లతో సినిమా ధియేటర్లు, షూటింగులతో స్టార్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా బ్యాక్ టూ..

Telugu Film Shooting: జెట్ స్పీడ్‌తో టాలీవుడ్.. ఏ సినిమా ఎక్కడ షూట్‌లో ఉందంటే

Telugu Film Shooting

Telugu Film Shooting: కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ ఇప్పుడు జెట్ స్పీడ్ మీదుంది. ఒక వైపు రిలీజ్ లతో సినిమా ధియేటర్లు, షూటింగులతో స్టార్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ షూట్స్ తో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న మన స్టార్లు.. కొత్త కొత్త ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కిస్తున్నారు. చిరంజీవి నుండి శర్వానంద్ వరకు అందరూ షూటింగ్ స్పాట్ లోనే ఉన్నారు.

Prabhas: ఫ్యాన్స్ ఆకలి తీర్చేసే రెబల్ స్టార్.. ట్రిపుల్ బొనాంజా!

సీనియర్ హీరో అయినా సినిమాల విషయంలో ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు చిరంజీవి. ఆచార్య సినిమా కంప్లీట్ చేసుకున్న మెగాస్టార్.. వెంటనే గాడ్ ఫాదర్ కి షిఫ్ట్ అయ్యారు. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రజెంట్ ఊటీ లో షూటింగ్ జరుపుకుంటోంది. బన్నీకూడా బ్యాక్ టూ బ్యాక్ షూట్ చేస్తున్నారు. డిసెంబర్ రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప మూవీకి సంబందించి లాస్ట్ షెడ్యూల్ భూత్ బంగ్లాలో జరుగుతోంది.

Sarayu Roy: నేను వర్జిన్ కాదు.. ఏడేళ్ల సహజీవనం.. సరయు బోల్డ్ కామెంట్స్!

నాగార్జున సంక్రాంతి బరిలోకి దిగుతున్న బంగార్రాజు మూవీ షూటింగ్ హయత్ నగర్ లో సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా సంక్రాంతి బరిలోకే దింపుతున్న ఎఫ్ 3 సినిమా ఫలక్ నుమా ప్యాలెస్ లో షూటింగ్ లో బిజీగా ఉంది. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న నాని.. రాహుల్ సాంస్క్యిత్యన్ తో చేస్తున్న అంటే సుందరానికి మూవీ మాదాపూర్ లొకేషన్స్ లో షూట్ చేస్తోంది.

Liger-Mike Tyson: కలలో కూడా ఊహించలే.. తెలుగు తెరకి మరో ఘనత!

మాస్ మహారాజా రవితేజ రామారావ్ ఆన్ డ్యూటీ మూవీ షూటింగ్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది. శర్వానంద్ నటిస్తున్న ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమా ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరపుకుంటుంటే.. గోపీచంద్, మారుతి కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ పక్కా కమర్షియల్ హైదరాబాద్ లోకల్ లొకేషన్స్ లో షూటింగ్ కంటిన్యూ చేస్తోంది.

Big Boss 5: ఎలిమినేషన్ గండం.. నాలుగో వారంలో ఎనిమిది మంది