Mega Family : హిట్స్ తో దూసుకుపోతున్న మెగా ఫ్యామిలీ.. నెక్స్ట్ ఎవరు?

గత సంవత్సర కాలంగా మెగా ఫ్యామిలిలో ఒకరి తర్వాత ఒకరు వరుసగా హిట్స్ కొడుతున్నారు.(Mega Family)

  • Published on- August 9, 2026 / 08:45 PM IST

Mega Family

Mega Family : మెగా ఫ్యామిలీ చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ వరుస హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వస్తుంది. గత కొన్నాళ్లుగా చిరు, పవన్, చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్.. ఇలా మెగా హీరోలంతా పడుతూ లేస్తున్నారు. ఒక్క హిట్ కొడితే రెండు ఫ్లాప్స్ వస్తున్నాయి అన్నట్టు ఉండేది. కానీ గత సంవత్సర కాలంగా మెగా ఫ్యామిలిలో ఒకరి తర్వాత ఒకరు వరుసగా హిట్స్ కొడుతున్నారు.

గత సంవత్సరం సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ OG సినిమాతో పెద్ద హిట్ కొట్టి పవన్ కెరీర్లోనే 300 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించి, హైయెస్ట్ హైప్ ఉన్న సినిమాగా సందడి చేసింది. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాక ప్రేక్షకులు, టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం OG సినిమాకు, పవన్ స్టైల్ కి ఫిదా అయిపోయారు.

భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో వచ్చి చిరు కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సెట్ చేసారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి బిగ్గెస్ట్ హిట్ కొట్టారు.

Also See : Allu Sirish Wife : ఫ్రెండ్స్ తో అల్లు శిరీష్ భార్య.. నయనికా రెడ్డి స్పెషల్ ఫొటోలు..

ఇక గేమ్ ఛేంజర్ సినిమాకు చాలా నెగిటివిటి చూసిన రామ్ చరణ్ ఇటీవల జూన్ లో పెద్ది సినిమాతో మాత్రం హిట్ కొట్టడమే కాక తన పర్ఫార్మెన్స్ తో అందర్నీ మెప్పించాడు. ఏ స్టార్ హీరో చేయలేని పాత్ర చేసి ఆశ్చర్యపరిచి విజయం సాధించాడు చరణ్ పెద్ది సినిమాతో. ఏకంగా 400 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది.

ఈ మధ్యలో మెగా డాటర్ నిహారిక నిర్మాతగా సక్సెస్ కొట్టింది. ఆల్రెడీ కమిటీ కుర్రాళ్ళు సినిమాతో పెద్ద హిట్ కొట్టిన నిహారిక ఈ సంవత్సరం ఏప్రిల్ లో రాకాస అనే హారర్ కామెడీ సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. దీనికి తోడు కమిటీ కుర్రాళ్ళు సినిమాకు రెండు నేషనల్ అవార్డులు సాధించి మరింత సక్సెస్ సాధించింది నిహారిక.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్నాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ మార్కెట్ కూడా పడిపోయింది. కానీ తాజాగా ఇటీవలే ఆగస్టు 7న కొరియన్ కనకరాజు సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. కామెడీ యాక్షన్ సినిమాగా వచ్చిన కొరియన్ కనకరాజు ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించి విజయం సాధించింది. తన ఫ్లాప్ స్ట్రీక్ ని బద్దలు కొట్టి వరుణ్ తేజ్ హిట్ కొట్టి మెగా ఫ్యామిలీ సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేసాడు.

Also See : Allu Arjun : వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్.. సందడి చేసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్..

దీంతో నెక్స్ట్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని, కోలుకొని విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే విరూపాక్ష పెద్ద హిట్ అయింది. కానీ ఆ తర్వాత బ్రో సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు సంబరాల ఏటిగట్టు సినిమాతో రాబోతున్నాడు. సాయి తేజ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో భారీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ హిట్ కొట్టి మెగా సక్సెస్ ట్రాక్ ని ముందుకు తీసుకెళ్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.

ఇక మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత మూడు సినిమాలు చేసినా మూడు నిరాశపరిచాయి. మళ్ళీ ఇంకో సినిమానే అనౌన్స్ చేయలేదు వైష్ణవ్. మరి ఈ హీరో కూడా ఏదైనా మంచి కథతో వచ్చి హిట్ కొడతాడేమో చూడాలి. మొత్తానికి మెగా ఫ్యామిలీ వరుసగా హిట్స్ కొడుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.