Waltair Veerayya : కర్ణాటకలో 154 ఆటోలతో మెగా ఫ్యాన్స్ జాతర..
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని థియేటర్ల వద్ద అభిమానులకు పూనకాలు రప్పిస్తుంది. కాగా చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో కూడా అభిమానులు వేలల్లో ఉంటారు. ముఖ్యంగా కర్ణాటకలో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజే వేరు.
- gum 95921
- Published On : January 14, 2023 / 07:45 AM IST
Waltair Veerayya
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ కేథరిన్ థ్రెసా ఒక కీలక పాత్ర పోషించింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఇక మొదటి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని థియేటర్ల వద్ద అభిమానులకు పూనకాలు రప్పిస్తుంది.
కాగా చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో కూడా అభిమానులు వేలల్లో ఉంటారు. ముఖ్యంగా కర్ణాటకలో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజే వేరు. అక్కడి హీరోలతో సమానంగా చిరు, పవన్, చరణ్ కు ఫ్యాన్ బేస్ ఉంటుంది. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ విడుదల సందర్భంగా అక్కడి ఫ్యాన్స్ మెగా జాతర నిర్వహించారు. ఈ సినిమా చిరుకి 154వ సినిమా కావడంతో 154 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జై వీరయ్య, జై చిరంజీవ అంటూ తీన్‌మార్ డప్పులతో ఎదుట వారికీ పూనకాలు తెప్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఇక ముందు నుంచి చెప్పుకొచ్చినట్లు దర్శకుడు బాబీ.. తన అభిమాన నటుడైన చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. టైటిల్ కార్డు దగ్గర నుంచి చిరంజీవి కామెడీ, ఫైట్స్, మాస్ అన్నిటిలో ఒకప్పటి చిరుని పరిచయం చేశాడు. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ బాబీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే గత కొంత కాలంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో విమర్శలు ఎదురుకుంటున్న దేవిశ్రీ ప్రసాద్.. ఈ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు అంటున్నారు.
Again i repeat
Boss of Indian cinemas ???#WaltairVeerayya#PoonakaaluLoading pic.twitter.com/MO0bT5dtvJ— Being Human (@Being_Human33) January 13, 2023
