×
Ad

Sai Dharam Tej : ఇవాళ వాలెంటైన్స్ డే.. రేపు ఏంటని అడుగుతున్న సాయి ధరమ్ తేజ్..

ఇవాళ వాలెంటైన్స్ డే ఓకే. కానీ రేపు ఏంటని అడుగుతున్న సాయి ధరమ్ తేజ్.

  • Published On : February 14, 2024 / 06:06 PM IST

Mega Hero Sai Dharam Tej post on Valentines Day gone viral

Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని.. గత ఏడాది ‘విరూపాక్ష’తో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ సినిమా చేసి ఆడియన్స్ ని అలరించారు. అయితే ప్రస్తుతం ఈ హీరో ఇంకా.. రెస్ట్ మోడ్ లోనే ఉన్నారు. యాక్సిడెంట్ తరువాత మరో సర్జరీని ఇటీవల చేయడంతో.. సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రెజెంట్ ఆల్మోస్ట్ కోలుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మళ్ళీ బ్యాక్ టు షూట్ అననున్నారు.

ఇది ఇలా ఉంటే, నేడు వాలెంటైన్స్ డే కావడంతో సెలబ్రిటీస్ అంతా తమ తమ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ఈక్రమంలోనే సాయి ధరమ్ తేజ్ కూడా ఆసక్తికర పోస్ట్ వేశారు. “ఈరోజు వాలెంటైన్స్ డే అంట. మరి రేపు ఏంటి..? కాబట్టి అందుకే ప్రతి ఒక్క రోజుని మీకు ఇష్టమైన వారితో స్పెషల్ గా జరుపుకోండి” అంటూ సాయి ధరమ్ పోస్ట్ వేశారు.

Also read : Nayanthara : మరోసారి ప్రేమలో పడిన నయనతార.. వాలంటైన్స్ డే నాడు ఆసక్తికర పోస్ట్..

కాగా సాయి ధరమ్ తేజ్.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. దింతో ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్.. ఆ సినిమా గుర్తు చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


ఇక సాయి ధరమ్ తేజ్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ‘గంజా శంకర్’ అనే మాస్ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో రూపొందే ఈ సినిమాని అనౌన్స్ చేస్తూనే.. ఒక చిన్న గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమా బడ్జెట్ కారణాలు వల్ల నిలిచిపోయిందని టాక్ వినిపిస్తుంది. మరి వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే.. మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సిందే.