Mega Prince Varun Tej Operation Valentine poster 126 feet cut out
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు నేడు జనవరి 19న కావడంతో మెగా ఫ్యాన్స్.. బర్త్ డే విషెస్ తెలియజేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈక్రమంలోనే కొందరు అభిమానులు భారీ కట్ అవుట్ ఏర్పాటు చేసి వరుణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికి తెలియజేశారు. వరుణ్ తేజ్ నటించిన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ సినిమాలో వరుణ్ జెట్ ఫైటర్ గా కనిపించబోతున్నారు.
ఇక ఈ మూవీ పోస్టర్‌నే దాదాపు 126 అడుగుల కట్ అవుట్ ని సూర్యాపేటలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కట్ అవుట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ఈ ఫోటోలను రీ షేర్ చేస్తూ మరోసారి వరుణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
A birthday celebration to remember ❤️?
Team #OperationValentine installed a Massive 126 ft cut-out of Mega Prince #VarunTej on his birthday which was unveiled by his fans on a grand scale?#HBDVarunTej @IAmVarunTej @ManushiChhillar @ShaktipsHada89 @ManushiChhillar… pic.twitter.com/QYBFJiILIt
— Madhu VR (@vrmadhu9) January 19, 2024
ఆపరేషన్ వాలెంటైన్ సినిమా విషయానికి వస్తే.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో ఇతర దేశంలోకి వెళ్లి అక్కడ ఫైట్ చేసే పోరాట సన్నివేశాలతో థ్రిల్లర్ యాక్షన్ తో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
Also read : Shah Rukh Khan : మిషన్ ఇంపాజిబుల్, జాన్ విక్ చిత్రాలతో.. ఇంటర్నేషనల్ అవార్డుల్లో షారుఖ్ సినిమాలు పోటీ..
తెలుగు, హిందీ లాంగ్వేజ్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ‘వందేమాతరం’ అంటూ మొదటి పాటని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఫిబ్రవరి 16న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ బర్త్ డే సందర్భంగా వరుణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘మట్కా’ మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో వరుణ్ మాస్ రోల్ లో కనిపించి అదరగొడుతున్నారు.
1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా, నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు చేస్తున్నారు.