Megastar Chiranjeevi : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం.. మెగా విరాళం.. ఎంతంటే..?

తాజాగా మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi : కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరదల వల్ల విజయవాడ, ఖమ్మం మునిగిపోయి అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.

Also Read : Sundeep Kishan : సందీప్ కిషన్ మంచి మనుసు.. విజయవాడ వరద బాధితులకు ఫుడ్, వాటర్ సప్లై.. తన టీంతో..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో.. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు చిరంజీవి.

దీంతో అభిమానులు, నెటిజన్లు చిరంజీవిని అభినందిస్తున్నారు. ఇటీవల కేరళలో కూడా వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులను చూసి చిరంజీవి అక్కడి ప్రజల కోసం కూడా కోటి రూపాయలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చిన సంగతి తెలిసిందే.