స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని యంగ్ హీరో అఖిల్‌తోపాటు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తనయుడు అకీరా కూడా ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా చిరు వారికి శుభాకాంక్షలు తెలియచేశారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి తెరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు అల్లు అర్జున్. డ్యాన్స్‌ల్లోనూ, నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుని తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా బన్నీకి విషెస్ చెప్పారు. బన్నీ చిన్ననాటి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ‘బన్నీ డ్యాన్స్‌లో గ్రేస్ ఆ వయస్సు నుంచే ఉంది. బన్నీలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్. నువ్వు బాగుండాలబ్బా’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. చరణ్‌కి ఒక తమ్ముడు. నాకు, సురేఖకు మరో కొడుకు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. అందరూ ఇష్టపడే వ్యక్తి. ఈ ఏడాదంతా నీకు మంచి జరగాలి’ అంటూ తనకు, నాగార్జునకు మధ్యలో ఉన్న చిన్నారి అఖిల్ ఫోటోను పోస్ట్ చేశారు చిరు.
‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6’4). అన్ని విషయాల్లోనూ అందరిని ఇలానే మించిపోవాలి. విష్ యూ ఏ ‘పవర్’ఫుల్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్‌డే అకీరా’ అంటూ అకీరాను ఎత్తుకున్న ఫోటో షేర్ చేశారు చిరంజీవి.