Chiru Mohanbabu
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలతో.. ఇండస్ట్రీలో మెగా వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టుగా సిచువేషన్స్ క్రియేట్ అయ్యాయి. కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో టాలీవుడ్ లో కొన్నాళ్లుగా వాతావరణం వేడిగా ఉంటోంది. మా.. ప్రెసిడెంట్ గా మంచు విష్ణు విజయం తర్వాత మోహన్ బాబు.. ఇన్ డైరెక్ట్ గా చిరంజీవిపై పంచులు వేయడం సరికొత్త చర్చకు దారి తీసింది. కానీ.. అంతా కలిసే ఉండాలని, అంతా కలిసే పని చేయాలని పదే పదే మోహన్ బాబు చెప్పుకుంటూ రావడం.. గొడవ పెద్దది కాకుండా చేసింది.
ఈ విషయంపై తాజాగా.. చిరంజీవి సైతం స్పందించినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రకాశ్ రాజ్ కు తాను మద్దతు ఇచ్చినట్టుగా వచ్చిన వార్తలపై.. చిరంజీవి స్వయంగా మోహన్ బాబుకు ఫోన్ చేసి మాట్లాడారని.. తన పేరు అనవసరంగా బయటికి వచ్చిందని అన్నట్టుగా తెలుస్తోంది.
అయితే.. ప్రకాశ్ రాజ్ కు అన్నయ్య మద్దతు ఉందని.. స్వయంగా నాగబాబు కామెంట్ చేయడంతోనే.. మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీల మధ్య డైలాగ్ వార్ ముదిరిందన్న అభిప్రాయం ఉంది. ఆ చర్చకు.. ఇప్పుడు చిరంజీవి.. మోహన్ బాబుకు కాల్ చేసి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. చిరు కాల్ కు.. మోహన్ బాబు సైతం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని.. అందరూ కలిసి పని చేయాలన్నదే తన అభిమతం అని ఆయన మరోసారి చెప్పారని తెలుస్తోంది.
ఈ ఊహాగానాలపై ఇంతవరకూ అఫీషియల్ స్టేట్ మెంట్ అంటూ ఏదీ లేకున్నా.. ఇది నిజమై సినిమా ఇండస్ట్రీలో గొడవలు తగ్గితే బాగుంటుంది.. అని సగటు సినీ అభిమాని మాత్రం కోరుకుంటున్నాడు.